News September 5, 2024
గురువులంటే టార్చర్ కాదు.. మంచి ఫ్యూచర్‌నిచ్చే టార్చ్‌బేరర్స్
గురువులు పాఠాలు, గుణపాఠాలు, జీవిత పాఠాలు బోధిస్తారు. ఆటలు, పాటలతో పాటు పోరాటాలు చేయడమూ నేర్పిస్తారు. అజ్ఞానం తొలగించి జ్ఞానాన్నిస్తారు. టాలెంట్‌ను గుర్తించి శిక్షణనిస్తారు, తప్పు చేస్తే శిక్షిస్తారు. అయితేనేం తమ శిష్యులను ఉన్నత శిఖరాలకు చేరుస్తారు. అనుకున్నది సాధించేలా ప్రోత్సహిస్తారు. అందుకే మంచి గురువులున్నవారి బతుకు, భవిష్యత్తు కూడా మంచిగానే ఉంటుంది.
✒ గురువులందరికీ HAPPY TEACHERS DAY
Similar News
News September 13, 2024
ఈ శతాబ్దపు అత్యుత్తమ టెస్ట్ పేసర్లు ఎవరు..?
21వ శతాబ్దంలో క్రికెట్‌లో ఎంతోమంది బౌలర్లు వచ్చారు, వెళ్లారు. మరి వీరందరిలో అత్యుత్తమ టెస్టు బౌలర్లు ఎవరు? దీనిపై నిపుణుల ప్యానెల్ సాయంతో క్రిక్‌ఇన్ఫో ఓ జాబితా తయారు చేసింది. డేల్ స్టెయిన్ అందులో అగ్రస్థానంలో నిలిచారు. తర్వాత వరసగా జేమ్స్ ఆండర్సన్, జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్, రబాడ, స్టువర్ట్ బ్రాడ్, ట్రెంట్ బౌల్ట్, వెర్నన్ ఫిలాండర్ ఉన్నారు. మరి మీ దృష్టిలో బెస్ట్ బౌలర్ ఎవరు? కామెంట్ చేయండి.
News September 13, 2024
పోర్ట్ బ్లెయిర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే..
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌ను<<14093820>> కేంద్రం శ్రీవిజయపురంగా మార్చిన<<>> సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ ప్రభుత్వం ఈ దీవుల్లో కాలనీలను ప్రారంభించాలని భావించింది. దానికోసం ఆర్చిబాల్డ్ బ్లెయిర్ అనే అధికారిని 1788లో తమ ప్రతినిధిగా నియమించింది. బ్రిటన్ సిబ్బంది, సేవకులతో కలిసి ఆయన ఇక్కడ నివసించేవారు. కాలక్రమంలో అతడి పేరునే రాజధానికి పోర్ట్ బ్లెయిర్‌గా పెట్టారు.
News September 13, 2024
ఫేమస్ బాడీబిల్డర్ గుండెపోటుతో మృతి
‘ప్రపంచ భయంకరమైన బాడీబిల్డర్’గా పేరొందిన ఇలియా గోలెం(36) హార్ట్‌ఎటాక్‌తో కన్నుమూశారు. ఈనెల 6న గుండెపోటుకు గురైన ఆయన చికిత్స పొందుతూ 11న ప్రాణాలు కోల్పోయారు. బెలారస్‌కు చెందిన ఈ బాడీబిల్డర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అభిమానులు అతడిని ‘ది మ్యుటాంట్’ అనే నిక్‌నేమ్‌తో పిలుచుకుంటారు. 154 కేజీల బరువున్న అతడి ఎత్తు 6.1 అడుగులు. చెస్ట్ 61 అంగుళాలు కాగా బైసెప్స్ 25 ఇంచులు ఉండటం విశేషం.