News September 25, 2024
హజ్ యాత్ర దరఖాస్తు గడువు పొడిగింపు
AP: హజ్ యాత్రకు దరఖాస్తు గడువును హజ్ కమిటీ ఆఫ్ ఇండియా పొడిగించింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి ఎన్ఎమ్‌డీ ఫరూక్ తెలిపారు. ఏపీ నుంచి ఇప్పటి వరకు 1,937 మంది యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.
Similar News
News October 13, 2024
బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలు మూతపడేది ఎప్పుడంటే?
శీతాకాలం ప్రారంభం అవుతుండటంతో ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల మూసివేత తేదీలను ఆలయ కమిటీ ప్రకటించింది. NOV 17న బద్రీనాథ్, కేదార్‌నాథ్, నవంబర్ 3న యమునోత్రి, గంగోత్రి ఆలయ తలుపులను మూసివేయనున్నారు. అలాగే రుద్రనాథ్ ప్రవేశద్వారాలు ఈ నెల 17న క్లోజ్ చేస్తారు. ఈ ఏడాది బద్రీనాథ్‌ను 11 లక్షల మంది, కేదార్‌నాథ్‌ను 13.5 లక్షల మంది దర్శించుకున్నారు. శీతాకాలంలో ఈ ఆలయాలు మంచుతో కప్పబడి ఉంటాయి.
News October 13, 2024
దసరా వేడుకల్లో విషాదం
AP: కోనసీమ, కడప జిల్లాల్లో దసరా ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా అమలాపురం మండలం కొంకాపల్లిలో డీజే సౌండ్‌కు వినయ్ అనే యువకుడు డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించాడు. మరోవైపు కడపలోని బెల్లంబండి వీధిలో దసరా ఊరేగింపులో పందిరి పైభాగానికి విద్యుత్ తీగలు తగిలాయి. షాక్‌తో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.
News October 13, 2024
ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన 34 ప్రపంచ దేశాలు
లెబనాన్‌లోని UN శాంతిపరిరక్షణ బలగాల స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులను భారత్‌తోపాటు 34 ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇలాంటి చర్యలను వెంటనే విరమించుకోవాలని సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇటీవల దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఐదుగురు శాంతి పరిరక్షకులు గాయపడ్డారు. ఈ దాడుల్ని ఉద్దేశపూర్వక చర్యలుగా UNIFIL ఆరోపించింది. బలగాల రక్షణ అత్యంత ప్రాధాన్యాంశంగా భారత్ పేర్కొంది.