News November 3, 2024

అరకోటి కుటుంబాలు ఆ పథకానికి దూరం: వైసీపీ

image

AP: ఉచిత సిలిండర్ పేరిట అరకొరగా లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం ఎంపిక చేసిందని వైసీపీ దుయ్యబట్టింది. దీంతో దాదాపు అరకోటి మందిని పథకానికి దూరంగా ఉంచిందని Xలో ట్వీట్ చేసింది. శాడిస్ట్ చంద్రబాబు చెప్పేవన్నీ ‘గ్యాస్’ కబుర్లేనని విమర్శించింది. ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వడానికి రూ.4వేల కోట్లు అవసరమైతే ప్రభుత్వం రూ.2,684.75 కోట్లు ఇస్తోందని ఆరోపించింది.

Similar News

News December 9, 2025

తిరుమలలో తులాభారం గురించి తెలుసా?

image

తిరుమల కొండపై శ్రీవారి మొక్కుబడులలో తలనీలాల తర్వాత అంతే ముఖ్యమైనది ‘తులాభారం’. ఇది భక్తులు తమ పిల్లల దీర్ఘాయుష్షు కోసం, తమ కోరికలు తీరినందుకు తీర్చుకునే మొక్కుగా భావిస్తారు. బిడ్డ బరువెంతుందో అంతే మొత్తంలో చిల్లర నాణాలు, బెల్లం, చక్కెర, కలకండ, బియ్యంతో తూకం వేసి, ఆ మొత్తాన్ని స్వామివారి హుండీకి సమర్పిస్తారు. ఈ మొక్కును ఆలయ మహద్వారం వద్ద రుసుము చెల్లించి తీర్చుకోవచ్చు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 9, 2025

తప్పిపోయిన అవ్వను గుర్తించిన మనమడు.. ఎలాగంటే?

image

అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న 75 ఏళ్ల వృద్ధురాలు(ముంబై) ఇంటి నుంచి బయటకెళ్లి తప్పిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందగా ఆమె మనమడు మాత్రం తన ఆలోచనకు పదును పెట్టాడు. వృద్ధురాలు తాజుద్దీన్ ధరించిన నక్లెస్‌లో ఉన్న GPSతో ఆమె ఉన్న చోటును ట్రాక్ చేశాడు. బైక్ ఢీకొట్టడం వల్ల ఆస్పత్రిపాలైనట్లు తెలుసుకొని ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చాడు. అలా సాంకేతికత ఆమెను తిరిగి కుటుంబానికి దగ్గర చేసింది.

News December 9, 2025

స్థూల సేంద్రియ ఎరువుల ప్రత్యేక ఏమిటి?

image

స్థూల సేంద్రియ ఎరువుల్లో పోషకాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటిని ఎక్కువ పరిమాణంలో వాడవలసి ఉంటుంది. వీటి వినియోగంతో నేలలో నీరు ఇంకే స్వభావం, నీరు నిల్వ చేసే గుణం, నీటి పారుదల, నేల ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ మెరుగుపడతాయి. ఉదాహరణ: పశువుల ఎరువు, కోళ్లు, మేకల విసర్జన పదార్థాల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు మొదలైనవి. ఇవి మన ఊళ్లలోనే దొరుకుతాయి. వాటిని వృథాగా వదిలేయకుండా పొలాల్లో వేస్తే మంచి ఫలితాలు వస్తాయి.