News November 3, 2024
అరకోటి కుటుంబాలు ఆ పథకానికి దూరం: వైసీపీ
AP: ఉచిత సిలిండర్ పేరిట అరకొరగా లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం ఎంపిక చేసిందని వైసీపీ దుయ్యబట్టింది. దీంతో దాదాపు అరకోటి మందిని పథకానికి దూరంగా ఉంచిందని Xలో ట్వీట్ చేసింది. శాడిస్ట్ చంద్రబాబు చెప్పేవన్నీ ‘గ్యాస్’ కబుర్లేనని విమర్శించింది. ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వడానికి రూ.4వేల కోట్లు అవసరమైతే ప్రభుత్వం రూ.2,684.75 కోట్లు ఇస్తోందని ఆరోపించింది.
Similar News
News December 2, 2024
5వికెట్లు కోల్పోయినా 6 వికెట్ల తేడాతో భారత్ ఎలా గెలిచింది?
AUS PM XIతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్లు కోల్పోయినా 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 5 వికెట్ల తేడా కదా? అనే సందేహం చాలామందికి వచ్చింది. అయితే 46ఓవర్ల మ్యాచ్‌లో మొదట PM XI 43.2 ఓవర్లలో 240/10 స్కోర్ చేసింది. భారత్ 42.5 ఓవర్లలోనే 4 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో గెలిచాక కూడా 46ఓవర్లు పూర్తిగా ఆడింది. లక్ష్యాన్ని ఛేదించాక మరో వికెట్ కోల్పోయింది.
News December 2, 2024
హెడ్‌పోన్స్ అతిగా వాడకండి!
కొందరు భారీ శబ్దంతో ఎక్కువ సేపు హెడ్‌ఫోన్స్ వాడుతుంటారు. ఇలానే చేసిన 38 ఏళ్ల లెక్చరర్ అవిక్ బెనర్జీ ఆస్పత్రి పాలయ్యారనే విషయం మీకు తెలుసా? 15 ఏళ్లుగా ఎక్కువ సౌండ్‌తో హెడ్‌సెట్ పెట్టుకొని గేమ్స్ ఆడుతుండగా ఒకరోజు చెవులు వినిపించలేదు. దీంతో ఆస్పత్రికి వెళ్లగా చికిత్స చేశారు. అందుకే తక్కువ శబ్దాన్ని వినాలని, మొబైల్ & స్క్రీన్ ఎక్కువ చూసేవారు 20-20-20 నియమాన్ని అనుసరించాలని వైద్యులు సూచిస్తున్నారు.
News December 2, 2024
మండపంలో కూర్చొని కూడా లూడో ఆడుతున్నాడు బ్రో
మూడు ముళ్లు వేసి, భాగస్వామితో ఏడడుగులు వేయాల్సిన సమయంలో కూడా ఓ పెళ్లికొడుకు లూడో ఆడుతూ కనిపించడం వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్నది తెలియకున్నా పెళ్లికొడుకు Just Relaxగా ఉండడంపై అందరూ ఫిదా అవుతున్నారు. ప్రపంచంలో ఏం జరిగినా సరే నువ్వు మాత్రం లూడో ఆడు బ్రో అని ఒకరు, Bro has his own priorities అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. మీ సర్కిల్‌లో ఉన్న లూడో లవర్‌తో Share This.