News December 5, 2024

EWS కోటాలో కాపులకు సగం సరికాదు: హైకోర్టు

image

AP: EWS 10% కోటాలో కాపులకు 5% కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలపై తమకు సందేహాలున్నాయని హైకోర్టు తెలిపింది. ఈ కోటాలో ఓ వర్గానికే సగం ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. కాపులకు 5% కోటా అమలు చేయాలని హరిరామజోగయ్య పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని పలువురు సవాల్ చేశారు. ఈ విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్లను ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు JAN29కి వాయిదా వేసింది.

Similar News

News January 19, 2026

ఇండియన్ క్రికెట్‌లో ఏం తప్పు జరుగుతోంది: CV ఆనంద్

image

న్యూజిలాండ్ చేతిలో భారత్ చారిత్రక ఓటమిని ఎదుర్కోవడంపై IPS CV సివి ఆనంద్ చేసిన ఘాటు వ్యాఖ్యలు SMలో వైరల్‌గా మారాయి. ‘ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు, అపారమైన ప్రతిభ, ఏడాదంతా టోర్నీలు ఉన్నప్పటికీ.. మనం వరుసగా అన్నీ ఓడిపోతున్నాం. అసలు ఇండియన్ క్రికెట్‌లో తప్పెక్కడ జరుగుతోంది? IPL డబ్బు ప్రభావం, ఆటగాళ్లలో టెంపర్మెంట్ తగ్గడం, పూర్ సెలక్షన్, కోచ్ గంభీరే దీనికి కారణమా?’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.

News January 19, 2026

ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!

image

TG: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం అందించిన రిజర్వేషన్ల సమాచారాన్ని SEC వెబ్‌సైట్లో పొందుపరిచింది. నిన్న మేడారంలో జరిగిన క్యాబినెట్ భేటీలో మున్సి‘పోల్స్’కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. FEB 14 నుంచి ఈ ఎన్నికలు జరగవచ్చన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఇపుడు SEC రిజర్వేషన్లను ప్రకటించడంతో ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చని స్పష్టమవుతోంది.

News January 19, 2026

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!

image

వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీనికి ముందు వరుసగా 3 రోజులు సెలవులున్నాయి. జనవరి 24 (నాలుగో శనివారం), 25 (ఆదివారం), 26 (గణతంత్ర దినోత్సవం) సెలవులు కాగా 27న సమ్మె జరగనుంది. దీంతో వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్ పనులుంటే ముందే ప్లాన్ చేసుకోవడం బెటర్.