News February 19, 2025
రేపటి నుంచి హాల్‌టికెట్ల పంపిణీ

AP: మార్చి 1 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 10.58 లక్షల మంది విద్యార్థులు హాజరుకానుండగా MAR 15తో జనరల్, 20న ఒకేషనల్ పరీక్షలు ముగుస్తాయి. రేపటి నుంచి విద్యార్థులకు హాల్‌టికెట్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, ట్యాంపరింగ్‌ను అరికట్టేలా QR కోడ్ విధానం అమలు చేస్తున్నారు. దీంతో ఒకవేళ పేపర్ లీకైనా అదెక్కడి నుంచి వచ్చిందో వెంటనే తెలిసిపోతుంది.
Similar News
News March 27, 2025
2 రోజులు సెలవులు

TG: రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు మంజూరు చేసింది. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం మార్చి 31న (సోమవారం) ఈద్ ఉల్ ఫితర్‌తో పాటు ఆ తర్వాతి రోజు ఏప్రిల్ 1న (మంగళవారం) కూడా హాలిడే ఇచ్చింది. ఇక మార్చి 28న జుమాతుల్-విదా, షబ్-ఎ-ఖాదర్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. ఆ రోజు మైనారిటీ విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. అటు ఏపీలో మార్చి 31న మాత్రమే సెలవు ఇచ్చారు.
News March 27, 2025
రేవంత్ ‘తెలంగాణ బూతుపిత’ అవుతారు: KTR

TG: ఎవ్వరు ఏమనుకున్నా తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని BRS ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రేవంత్ తెలంగాణ బూతుపిత అవుతారని ఎద్దేవా చేశారు. తుపాకుల గురించి రేవంత్‌కు తెలిసినంత తమకు తెలియదన్నారు. ఉద్యమకారులపై గన్ను ఎక్కుపెట్టిన చరిత్ర ఆయనదని దుయ్యబట్టారు. ప్రజాపాలన విఫల పాలన అని ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. అప్పులు, అబద్దాలు, బూతులు, అన్నదాతల ఆత్మహత్యలలో తెలంగాణ రైజింగ్ అని విమర్శలు చేశారు.
News March 27, 2025
KCRను బండకేసి కొట్టారు: సీఎం రేవంత్

BRS నేతలు తెలంగాణ గాంధీగా పిలుచుకునే KCRను కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టారని సీఎం రేవంత్ అసెంబ్లీలో అన్నారు. ‘నాకు ఓడిపోవడం కొత్త కాదు. కామారెడ్డిలో నేను పోతూ పోతూ.. నిన్ను కూడా తీసుకెళ్తానని చెప్పా. అనుకున్నట్టుగానే అక్కడి ప్రజలు సామాన్యుడిని గెలిపించారు. ప్రజలు తిరస్కరించినా BRS నేతలు ఎందుకు బుకాయిస్తున్నారు? KCR వందేళ్లు ఆరోగ్యంగా ఉండి ప్రతిపక్ష నేత బాధ్యత నిర్వర్తించాలి’ అని ఆకాంక్షించారు.