News October 14, 2024
9/11 తరహా దాడులకు హమాస్ కుట్ర?
ఇజ్రాయెల్‌పై 9/11 తరహా దాడులకు హమాస్ కుట్ర పన్నినట్లు IDF తెలిపింది. ఈ కుట్రకు సంబంధించిన రికార్డులను ఖాన్ యూనిస్‌లోని హమాస్ కమాండ్ సెంటర్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. టెల్ అవీవ్‌లోని 70 అంతస్తుల భవనం మోషే అవివ్, ఇజ్రాయెల్ టవర్లను నేలమట్టం చేసేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడించింది. ఈ రికార్డుల్లో ఇరాన్ ప్రతినిధులతో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ జరిపిన సంభాషణలు కూడా ఉన్నట్లు తెలిపింది.
Similar News
News November 8, 2024
46 రోజుల్లో భూమిని చుట్టేసే పక్షి!
ఆల్బట్రాస్ అనే పక్షి భూమిని 46 రోజుల్లోనే చుట్టి వస్తుంది. బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే పేరిట పక్షి జాతుల పరిశోధకులు 2005లో వీటిపై అధ్యయనం నిర్వహించారు. ఆ జాతికి చెందిన 22 పక్షులకు ట్రాకింగ్ పరికరాల్ని అమర్చి వాటి వలస మార్గాల్ని ట్రాక్ చేశారు. దక్షిణ అట్లాంటిక్‌లోని దక్షిణ జార్జియా నుంచి వలసకు బయలుదేరిన ఆల్బట్రాస్‌లలో కొన్ని పక్షులు 46 రోజుల్లో భూమిని చుట్టి వచ్చినట్లు ఆ అధ్యయనంలో తేలింది.
News November 8, 2024
ఆ రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించిన వైసీపీ
AP: చిలకలూరిపేట, తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ సమన్వయకర్తలను ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు చిలకలూరిపేట నియోజకవర్గానికి విడదల రజిని, తాడికొండకు వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు)ను నియమించినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.
News November 8, 2024
‘పుష్ప-2’ ఐటమ్ సాంగ్ ఫొటో లీక్?
‘పుష్ప-2’ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుంది. ప్రస్తుతం ఐటం సాంగ్ చిత్రీకరిస్తుండగా దానికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సెట్‌లో అల్లు అర్జున్‌తో కలిసి శ్రీలీల స్టెప్పులేస్తున్నట్లుగా ఇందులో కనిపించింది. బన్నీ డిఫరెంట్ కాస్ట్యూమ్‌తో కనిపిస్తున్నారు. ఈ సాంగ్ వీడియో కూడా లీకైందని కొందరు పోస్టులు చేస్తున్నారు. మరికొందరేమో ఇలా లీక్ చేయడం కరెక్ట్ కాదని, ఫేక్ అని కామెంట్లు చేస్తున్నారు.