News September 25, 2024
డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించండి: సీఎం
TG: దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని, అర్హులకు ఇళ్లు దక్కాలని సీఎం రేవంత్ ఆదేశించారు. PMAY కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రాబట్టాలని అధికారులకు సూచించారు. రాజీవ్ స్వగృహలో నిరుపయోగంగా ఉన్న బ్లాక్స్, ఇళ్లు వేలం వేయాలని, ఏళ్ల తరబడి వృథాగా ఉంచడం సరికాదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా వాటిని ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. అర్హులకు ఆ ఇళ్లను అప్పగించాలన్నారు.
Similar News
News October 12, 2024
నేటి నుంచి పాపికొండలు టూర్ స్టార్ట్
దసరా సందర్భంగా పర్యాటకులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి పాపికొండల్లో లాంచీల్లో విహరించేందుకు అధికారులు అనుమతిచ్చారు. వరదల కారణంగా ఐదు నెలల పాటు పాపికొండలు టూరిజంను నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితులు మెరుగవ్వడంతో లాంచీ యజమానుల విజ్ఞప్తుల మేరకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు.
News October 12, 2024
నవంబర్ 8 నుంచి DAO సర్టిఫికెట్ వెరిఫికేషన్
TG: డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(DAO) ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు TGPSC కీలక అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపింది. అభ్యర్థులు 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. దివ్యాంగుల కేటగిరీలో 1:5 నిష్పత్తిలో సెలక్ట్ చేశారు.
News October 12, 2024
పండగకు ఊరెళ్తున్న సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. సీఎం హోదాలో తొలిసారి సొంతూరికి వెళ్తున్న ఆయన అక్కడే దసరా వేడుకల్లో పాల్గొంటారు. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేవంత్ కుటుంబ సమేతంగా పండుగ జరుపుకోనున్నారు.