News December 17, 2024

త్వరలో చేనేత రుణాల మాఫీ: తుమ్మల

image

TG: త్వరలోనే రాష్ట్రంలోని చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామని అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఏడాదిలో 13 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని, వారిలో ముగ్గురి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. మరో 10 మందికీ త్వరలోనే సాయం చేస్తామని వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని జిల్లాల సంఖ్యను తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మరో మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

Similar News

News January 19, 2025

అత్యధిక వికెట్లు.. కానీ CTలో నో ఛాన్స్

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో మహమ్మద్ సిరాజ్ లేకపోవడంపై కొందరు క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2022 నుంచి వన్డేల్లో ఎక్కువ వికెట్లు (71) తీసిన భారత బౌలర్ అతడేనని గుర్తు చేస్తున్నారు. అయితే సిరాజ్‌కు న్యూ బాల్‌తో బౌలింగ్ వేసే ఛాన్స్ రాకపోతే అంత ప్రభావవంతంగా కనిపించడని కెప్టెన్ రోహిత్ శర్మ నిన్న చెప్పారు. అర్ష్‌దీప్ సింగ్ కొత్త, పాత బంతితో బౌలింగ్ వేయగలడని తెలిపారు. దీనిపై మీ కామెంట్?

News January 19, 2025

మహిళల ఖాతాల్లోకి రూ.12వేలు

image

TG: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12వేల ఆర్థిక చేయూత నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదని చెప్పారు. ఉపాధి హామీ కూలీల ఆధార్ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదని, డేటా ఎంట్రీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నెల 26న తొలి విడతగా అకౌంట్లలో రూ.6వేలు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

News January 19, 2025

ముగిసిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు

image

TG: వర్షాకాలం వరిధాన్యం సేకరణ ముగిసినట్లు సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో 53.32 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు. వీటిలో సన్న వడ్లు 23.73 లక్షల టన్నులు ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో మొత్తం రూ.12,022 కోట్లను జమ చేశామని తెలిపారు. ప్రభుత్వం ఈ సారి సన్నవడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందజేసిన సంగతి తెలిసిందే.