News August 18, 2024

హను స్పెషల్ ఇదే..

image

హను రాఘవపూడి సినిమా అనగానే హీరోయిన్లు ప్రత్యేకం. అందాల రాక్షసి నుంచి మొదలుకొని తాజా మూవీ వరకు ఆయన ఎంపిక భిన్నం. చలాకీతనానికి తోడు అందంతోనూ ఆకట్టుకున్నారు. లావణ్య త్రిపాఠి(అందాల రాక్షసి), మెహరిన్(కృష్ణగాడి వీరప్రేమ గాథ), మేఘా ఆకాశ్(లై), మృణాల్ ఠాకూర్(సీతారామం)ను ఇండస్ట్రీకి పరిచయం చేయగా ఇమాన్వీ వారి సరసన చేరనున్నారు. సాయి పల్లవిని పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో కొత్తగా చూపించి మెప్పించారు.

Similar News

News September 12, 2024

ఇందిరాగాంధీతో JNUకి రిజైన్ చేయించిన సీతారాం

image

సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించేవారు. 1977లో JNU ఛాన్సలర్‌గా ఉన్న అప్పటి PM ఇందిరాగాంధీ ఆ పోస్టుకు రిజైన్ చేయాలన్న డిమాండ్‌ను ఆమె ఎదుటే నిల్చుని వినిపించారాయన. JNU విద్యార్థుల్ని సంఘటితం చేసి ప్రధాని నివాసానికి తీసుకెళ్లి ఆమెపై చేసిన తీర్మానాన్ని చదివారు. ఆ తర్వాత ఇందిర ఆ పదవికి రిజైన్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

News September 12, 2024

ఎర్రమట్టి దిబ్బలపై విచారణకు ఆదేశం

image

AP: విశాఖ జిల్లా భీమిలి మండలంలోని ఎర్రమట్టి దిబ్బలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. సర్వే నంబర్ 118/5Aలో 250 ఎకరాలకు పైగా భూములను ఓ హౌసింగ్ సొసైటీకి కేటాయించారు. అయితే ఆ భూములన్నీ వారసత్వ సంపదగా ఉన్న ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలో ఉన్నాయని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఫిర్యాదుతో ప్రభుత్వం స్పందించి చర్యలకు ఆదేశించింది.

News September 12, 2024

సీతారాం ఏచూరి మృతిపై ప్రధాని మోదీ సంతాపం

image

సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. లెఫ్ట్ పార్టీలకు ఆయనో దిక్సూచిలా వ్యవహరించారని, రాజకీయాలకు అతీతంగా అందరితో అనుబంధం ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు. ఏచూరి కుటుంబానికి, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇక దేశ రాజకీయాలకు ఏచూరి మృతి తీరని లోటని కేరళ సీఎం పినరయి విజయన్, ఎంపీ కపిల్ సిబల్ ఆవేదన వ్యక్తం చేశారు.