News June 4, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News September 13, 2024
ఖరీదైన కారు కొన్న హీరో అజిత్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ పోర్షే జీటీ2ఆర్ఎస్ కారును కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు రూ.4 కోట్లకు పైమాటే. ఆయన భార్య షాలిని ఆ ఫొటోలను షేర్ చేశారు. అజిత్‌కు రేసింగ్, కార్లు, బైకులు అంటే ఇష్టం. ఈ ఏడాది ఆగస్టులోనూ ఆయన రూ.9 కోట్ల విలువైన ఫెరారీ కొన్నట్లు సమాచారం. దుబాయ్‌లో ఆయన ఆ కారు నడుపుతున్న వీడియో అప్పట్లో వైరల్ అయింది.
News September 13, 2024
నా X అకౌంట్ హ్యాక్ అయింది: నయనతార
తన X(ట్విటర్) అకౌంట్ హ్యాక్ అయినట్లు హీరోయిన్ నయనతార తెలిపారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు. ఏవైనా అనవసర, అనుమానాస్పద ట్వీట్లు చేస్తే దయచేసి ఇగ్నోర్ చేయాలని ఆమె కోరారు. ఇక షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జవాన్’ విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా మూవీని నవంబర్ 29న జపాన్‌లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ నిన్న ప్రకటించారు.
News September 13, 2024
ప్రభుత్వ వరద సహాయక చర్యలపై ప్రజల సంతృప్తి: పురందీశ్వరి
AP: భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి చెప్పారు. వరదల్లో, ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. విజయవాడలోని కలెక్టరేట్‌లోనే ఉండి CM చంద్రబాబు తీసుకున్న చర్యలు ఆదర్శనీయమని కొనియాడారు. వరద ప్రాంతాలను శుభ్రం చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కృషి చేశారన్నారు. వారిని సన్మానించి, వస్త్రాలను అందించారు.