News March 25, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News December 6, 2025
ఈ రోజు రాత్రి నుంచి జాగ్రత్త!

తెలంగాణలో కోల్డ్ వేవ్ ప్రారంభమైందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో ఈ ఉదయం 6 గం.కు అత్యల్పంగా 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లోనూ సింగిల్ డిజిట్ టెంపరేచర్, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో 12.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజు రాత్రి నుంచి కోల్డ్ వేవ్ ప్రభావం పెరుగుతుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
News December 6, 2025
న్యూస్ రౌండప్

⋆ నేడు నల్గొండ జిల్లా దేవరకొండలో సీఎం రేవంత్ పర్యటన
⋆ తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
⋆ నేషనల్ హెరాల్డ్ కేసులో DK శివకుమార్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. DEC 19న విచారణకు రావాలని ఆదేశం
⋆ నేడు మరోసారి పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి
⋆ శాంతిభద్రతల పరిరక్షణకు HYDలో ‘ఆపరేషన్ కవచ్’.. నిన్న అర్ధరాత్రి దాదాపు 5,000 మంది పోలీసులతో ఏకకాలంలో 150 ప్రాంతాల్లో తనిఖీలు
News December 6, 2025
ఫోన్ లొకేషన్ ట్రాకింగ్ తప్పనిసరి?.. ఎందుకోసం?

ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్ (A-GPS) వ్యవస్థ నిరంతరం యాక్టివేట్ చేసి ఉండాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫోన్ మేకర్లకు ఆదేశాలివ్వాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేసుల దర్యాప్తులో ప్రభుత్వ ఏజెన్సీలు లొకేషన్ కోసం సెల్యులార్ టవర్ డేటాపై ఆధారపడుతున్నాయి. కానీ కచ్చితమైన లొకేషన్ గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో A-GPSను తప్పనిసరి చేయాలని టెలికాం సంస్థలు ప్రతిపాదించాయి.


