News June 24, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News November 11, 2024
KL రాహుల్ లాంటి ప్లేయర్ ఎన్ని జట్లకు ఉన్నారు: గంభీర్
ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న KL రాహుల్‌కు కోచ్ గౌతమ్ గంభీర్ అండగా నిలిచారు. అతడిలాంటి ప్లేయర్ అసలు ఎన్ని జట్లకు ఉన్నారని ప్రశ్నించారు. ‘KL ఓపెనింగ్ నుంచి 6డౌన్ వరకు బ్యాటింగ్ చేస్తారు. అలా ఆడాలంటే స్పెషల్ టాలెంట్ కావాలి. పైగా వన్డేల్లో కీపింగ్ చేయగలరు. రోహిత్ లేకుంటే ఓపెనర్‌గా అతడూ ఓ ఆప్షన్’ అని BGT సిరీసుకు ముందు గౌతీ అన్నారు. చాన్నాళ్లుగా KL రన్స్ చేయలేక జట్టులోకి వస్తూ పోతూ ఉన్నారు.
News November 11, 2024
బడి దొంగలను చూశాం కానీ.. KCRపై సీఎం సెటైర్
TG: ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలని తాము అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బడి దొంగలను చూశాం కానీ అసెంబ్లీకి రాని వారిని ఇప్పుడే చూస్తున్నాం అని సెటైర్ వేశారు. శాసనసభకు వచ్చి సమస్యలపై చర్చించడం ప్రతిపక్ష నేత బాధ్యత అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ కూడా కట్టలేదు కానీ ఆయన మాత్రం 10 ఎకరాల్లో ఫాంహౌస్ కట్టుకున్నారని రేవంత్ విమర్శించారు.
News November 11, 2024
ఢిల్లీకి కేటీఆర్.. ‘అమృత్’ స్కామ్‌పై కేంద్రానికి ఫిర్యాదు
TG: మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. అమృత్ పథకంలో కుంభకోణం జరిగిందనే అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డికి లాభం చేకూరేలా అధికార దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.