News June 25, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News February 16, 2025
శ్రీశైలం విశిష్టత మీకు తెలుసా…!

ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలక్షేత్రం <<15471616>>రెండోది<<>>. ఈ మందిరంలో పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. పూర్వం కుమారస్వామిని వెతకడానికి క్రౌంచ పర్వతం (శ్రీశైలం) వెళ్లిన శివుడు ఆయన ఉన్నచోటనే లింగరూపంలో వెలిశారు. అక్కడ మద్ది చెట్టుకు మల్లెతీగ అద్దుకొని ఉందట. అప్పటినుంచి స్వామి వారికి ‘మల్లికార్జునుడు’ అని పేరొచ్చిందని స్థలపురాణం పేర్కొంటుంది.
News February 16, 2025
భారత్‌కు వారసులు హిందువులే: మోహన్ భాగవత్

దేశంలో హిందూ సమాజమే బాధ్యతాయుతమైనదని RSS చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందనే సత్యాన్ని హిందువులు విశ్వసిస్తారన్నారు. బెంగాల్‌లో మాట్లాడుతూ భారత్‌కు వారసులు హిందువులేనని పేర్కొన్నారు. ‘పాలకులు, మహారాజులను దేశం గుర్తుంచుకోదు. కానీ తండ్రి మాటకు కట్టుబడి 14ఏళ్ల వనవాసం చేసిన రాజును, సోదరుడి చెప్పులతో పాలన చేసిన వ్యక్తిని గుర్తుంచుకుంటుంది’ అని తెలిపారు.
News February 16, 2025
నెక్స్ట్ టార్గెట్ కొడాలి, పేర్ని నానిలే: మంత్రి కొల్లు

AP: వైసీపీ నేతలు చేసిన పాపాలే వారిని జైలుపాలు చేస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ‘నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది కొడాలి నాని, పేర్ని నానిలే. వైసీపీ హయాంలో వీరిద్దరూ అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారు. వీటిపై విచారణ చేసి వీరిని జైలుకు పంపుతాం’ అని ఆయన హెచ్చరించారు.