News July 18, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News February 16, 2025

మహిళలు ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రమిదే

image

మద్యం తాగే మహిళల సంఖ్య అస్సాంలో ఎక్కువగా ఉందని కేంద్ర సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 15-49ఏళ్ల స్త్రీల సగటు మద్యపానం 1.2% ఉండగా, అస్సాంలో ఇది 16.5% ఉంది. తర్వాతి స్థానాల్లో మేఘాలయ(8.7%), అరుణాచల్(3.3%) ఉన్నాయి. గతంలో టాప్‌లో ఉన్న ఝార్ఖండ్(9.9%), త్రిపుర(9.6%) తాజా సర్వేలో వరుసగా 0.3, 0.8 శాతానికి తగ్గిపోయాయి. మెట్రోపాలిటన్ రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక ఈ లిస్టులో లేకపోవడం గమనార్హం.

News February 16, 2025

OTTలోకి వచ్చేసిన కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’

image

కిచ్చా సుదీప్ నటించిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మ్యాక్స్’ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 22న రిలీజ్ చేస్తామని గతంలో చెప్పిన సంస్థ వారం ముందుగానే ఓటీటీలోకి తీసుకురావడం విశేషం. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం DEC 25న విడుదలై దాదాపు రూ.65 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో సునీల్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.

News February 16, 2025

ఈ ఆహారాలను మళ్లీ వేడి చేసి తింటున్నారా?

image

మనలో చాలా మంది మిగిలిపోయిన ఆహారాలను ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వేడి చేసుకుని తింటుంటారు. ఇది చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సీఫుడ్, ఆకుకూరలు, గుడ్లు, బంగాళదుంపలు, కాఫీ, టీ, అన్నం, వేయించిన పదార్థాలను మరోసారి వేడి చేస్తే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. వాటిలో పోషకాలు, ఖనిజాలు నాశనమవుతాయని, బ్యాక్టీరియా పెరుగుతుందని, జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు.

error: Content is protected !!