News August 5, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News September 10, 2024

APPLY NOW: దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు

image

స్పోర్ట్స్ కోటాలో 67 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్) ప్రకటించింది. SEP 7న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని, అక్టోబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. మహిళలు, పురుషులకు అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, చెస్, వెయిట్ లిఫ్టింగ్, క్రికెట్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ తదితర కేటగిరీల్లో <>ఉద్యోగాలు<<>> ఉన్నాయి. వయసు 18-20 ఏళ్ల మధ్య ఉండాలి. https://rrcmas.in/

News September 10, 2024

హైడ్రాకు ప్రత్యేక సిబ్బంది కేటాయింపు

image

TG: చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సిబ్బందిని కేటాయించింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్సై స్థాయి అధికారులను కేటాయిస్తూ డీజీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రాకు కమిషనర్‌గా రంగనాథ్ ఉన్న సంగతి తెలిసిందే.

News September 10, 2024

ఉచిత బస్సుతో అద్భుత ఫలితాలు.. సీఎంతో అధికారులు

image

TG: ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉచిత బస్సు స్కీం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని అధికారులు సమీక్షలో సీఎంకు చెప్పారు. ఇప్పటివరకు 83.42 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, తద్వారా ప్రయాణికులకు రూ.2,840 కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. వివిధ జిల్లాల నుంచి HYDలోని ఆస్పత్రులకు వస్తున్న మహిళల సంఖ్య పెరిగిందని వివరించారు.