News August 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News September 8, 2024

రాష్ట్రంలో వరద నష్టం ప్రాథమిక అంచనా ఇదే..

image

AP: రాష్ట్రంలో వరదల వల్ల రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. అత్యధికంగా R&B రూ.2164.5 కోట్లు, నీటివనరులు రూ.1568.5 కోట్లు, మున్సిపల్ శాఖలో రూ.1160 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. రెవెన్యూశాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖ రూ.481 కోట్లు, వ్యవసాయం రూ.301 కోట్లు, పంచాయతీ రోడ్ల విభాగం రూ.167.5 కోట్లు, మత్స్య శాఖకు రూ.157.86 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది.

News September 8, 2024

నిలబడి నీళ్లు ఎందుకు తాగకూడదంటే?

image

నీరు మనిషి శరీరానికి గొప్ప ఇంధనం. ప్రతి ఒక్కరూ రోజుకు 4లీటర్లు తాగడం చాలా అవసరం. అయితే నీళ్లు ఎలా తాగుతున్నామనేది కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సమస్యలతోపాటు జీర్ణవ్యవస్థ ప్రభావితమవుతుంది. నీరు త్వరగా పొట్టలోకి చేరి శరీరం కింది భాగంలో నొప్పిగా ఉంటుంది. అదే కూర్చొని తాగితే ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్డ్స్‌గా ఉండి బాడీకి అవసరమైన ఖనిజాలూ అందుతాయి.

News September 8, 2024

YCP శ్రేణుల ఫైర్.. ట్వీట్ డిలీట్ చేసిన బ్రహ్మాజీ

image

మాజీ CM జగన్‌పై సెటైరికల్ ట్వీట్ చేసిన <<14048027>>బ్రహ్మాజీపై<<>> YCP శ్రేణులు సోషల్ మీడియాలో ఫైరయ్యాయి. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా జగన్‌నే విమర్శించడం కొందరికి ఫ్యాషన్ అయిపోయిందని మండిపడ్డాయి. వరద సహాయక చర్యల్లో లోపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీకెందుకు కోపం వచ్చిందని నిలదీశాయి. రూ.కోటితోపాటు YCP ప్రజాప్రతినిధులు నెల జీతాన్ని కేటాయించడం కనిపించలేదా? అని దుయ్యబట్టాయి. దీంతో ఆయన ట్వీట్ డిలీట్ చేశారు.