News August 12, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News September 18, 2024

పడేసిన టెక్ షేర్లు.. ఆదుకొన్న ఫైనాన్స్ షేర్లు

image

స్టాక్ మార్కెట్లు నేడు మోస్తరు నష్టాల్లో ముగిశాయి. వడ్డీరేట్ల కోతపై US ఫెడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. భయంతో ఐటీ షేర్లను తెగనమ్మడంతో బెంచ్‌మార్క్ సూచీలు కనిష్ఠ స్థాయులకు చేరాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు అండగా నిలవడంతో నష్టాల్ని తగ్గించుకున్నాయి. సెన్సెక్స్ 82,948 (-131), నిఫ్టీ 25,377 (-41) వద్ద క్లోజయ్యాయి. టాప్-5 లూజర్స్‌లో టెక్ షేర్లే ఉన్నాయి.

News September 18, 2024

తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారి!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా రిలీజ్‌కు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. తెలుగు సినిమా చరిత్రలో మొట్ట మొదటిసారిగా UKలో ‘డాల్బీ అట్మాస్’లో స్క్రీనింగ్ అవనుందని మేకర్స్ ప్రకటించారు. ఈనెల 26వ తేదీన యూకేలో ప్రీమియర్ షోలు ఉంటాయని తెలిపాయి. కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ ఓవర్సీస్ బుకింగ్స్‌లోనూ సంచలనాలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.

News September 18, 2024

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

image

AP: నూతన మద్యం విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సగటు మద్యం ధర క్వార్టర్‌కు రూ.99 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అటు భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు మన్యం దొర అల్లూరి సీతారామరాజు పేరును పెట్టాలని నిర్ణయించారు.