News August 27, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News September 10, 2024

సల్మాన్-రష్మిక మూవీలో కాజల్ అగర్వాల్!

image

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ‘సికందర్’లో కాజల్ అగర్వాల్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఏ రోల్ పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది. AR మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాహుబలి ఫేమ్ సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.

News September 10, 2024

సాయంత్రంలోగా సాధారణ పరిస్థితులు నెలకొనాలి: సీఎం

image

AP: విజయవాడలో ఇవాళ సాయంత్రం వరకు సాధారణ స్థితి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా అక్కడి ప్రాంతాల్లో తిరుగుతూ సమీక్షలు నిర్వహించాలని, ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆ ప్రాంత మంత్రులకు సూచించారు. ముంపు ప్రాంతాలకు చెందిన 2.75లక్షల మందికి సహాయక చర్యలు అందించాలన్నారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చారు.

News September 10, 2024

వారితో మనసు విప్పి మాట్లాడండి

image

ఈమధ్య సమస్య చిన్నదైనా పెద్దదైనా ఆత్మహత్యే శరణ్యం అన్నట్లుగా చాలామంది భావిస్తున్నారు. ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయితే వారు ఆత్మహత్య చేసుకుంటామని నేరుగా చెప్పకపోయినా ఇన్‌డైరెక్ట్ మెసేజ్ ఇస్తారని విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రవర్తనలో మార్పు, ముభావంగా ఉండటం, నిరాశనిస్పృహలు ఉంటే వారితో మాట్లాడి, మనోధైర్యం నింపితే ఆత్మహత్య నుంచి కాపాడవచ్చంటున్నాయి.
>> నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం.