News September 26, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News October 30, 2025

టీమ్ ఇండియాకు బిగ్ షాక్

image

WWC: ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీ ఫైనల్‌లో టీమ్ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్న స్మృతి మంధాన(24) ఔటయ్యారు. తొలుత బంతిని అంపైర్ వైడ్‌గా ప్రకటించగా, ఆసీస్ క్యాచ్ కోసం రివ్యూ తీసుకుంది. రివ్యూలో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. ఈ నిర్ణయంపై స్మృతి అసంతృప్తిగా పెవిలియన్‌కు వెళ్లారు. అంతకుముందు షెఫాలీ 10 పరుగులకే వెనుదిరిగారు. 10 ఓవర్లకు భారత్ స్కోర్ 60/2గా ఉంది.

News October 30, 2025

2020 ఢిల్లీ అల్లర్లు: పోలీసుల అఫిడవిట్‌లో సంచలన విషయాలు

image

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. దేశంలో ప్రభుత్వాన్ని మార్చేందుకు CAA వ్యతిరేక నిరసనల పేరుతో అల్లర్లు చేశారని తెలిపారు. ఈ కేసులో నిందితులు ఖలీద్, ఇమామ్, హైదర్ తదితరుల బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్ ప్రకారమే అల్లర్లు సృష్టించారని అందులో పేర్కొన్నారు.

News October 30, 2025

కల్తీ నెయ్యి సరఫరాలో భారీ కుట్ర: సిట్

image

AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉందని సిట్ తేల్చింది. ఈ అక్రమాల్లో వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు <<16598439>>చిన్నఅప్పన్న<<>>కు భారీగా కమీషన్ ముట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆయన అరెస్టుతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాన్ ప్రకారం భోలేబాబా డెయిరీని తప్పించి ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కాంట్రాక్టు దక్కించుకునేలా చేశారని తేలింది.