News September 26, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News October 7, 2024

సింగరేణి లాభాలు.. అత్యధికం ఎవరికంటే?

image

TG: సింగరేణి లాభాల వాటాలో అత్యధికంగా మంచిర్యాల(D) శ్రీరాంపూర్ SRP-1 ఎస్డీఎల్ ఆపరేటర్ ఆసం శ్రీనివాస్‌ రూ.3.24 లక్షలు పొందారని AITUC అధ్యక్షుడు సీతారామయ్య వెల్లడించారు. ఆ తర్వాత మందమర్రి KK-5లో చేసే జనరల్ మజ్దూర్ రాజు రూ.3.1 లక్షలు, శ్రీరాంపూర్ ఆర్కే-5కు చెందిన SDL ఆపరేటర్ ఆటికం శ్రీనివాస్‌ రూ.3.01 లక్షల లాభాల వాటా పొందారని తెలిపారు. వీరికి ఇవాళ C&MD కార్యాలయంలో చెక్కులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

News October 7, 2024

22, 23 తేదీల్లో విజయవాడలో డ్రోన్ సమ్మిట్

image

AP: విజయవాడలో ఈ నెల 22, 23 తేదీల్లో అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ జరగనుంది. డ్రోన్ల తయారీ సంస్థలు, ఐఐటీలు, ఐఐఎస్‌సీల నుంచి దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. 22న కృష్ణా తీరంలో 5వేల డ్రోన్లతో భారీ ప్రదర్శన జరుగుతుంది. సదస్సులో సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారు. విస్తృతమైన ప్రజా వినియోగానికి వీలుగా డ్రోన్లను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

News October 7, 2024

కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన హార్దిక్

image

టీ20ల్లో అత్యధిక మ్యాచులను సిక్సర్లతో ముగించిన భారత ప్లేయర్‌గా హార్దిక్ పాండ్య నిలిచారు. బంగ్లాతో మ్యాచులో కోహ్లీ(4 మ్యాచులు) రికార్డును అధిగమించారు. ఆ తర్వాతి స్థానాల్లో ధోనీ, పంత్ మూడేసి మ్యాచులతో ఉన్నారు. కాగా బంగ్లాదేశ్ జరిగిన T20 మ్యాచులో హార్దిక్ 39 పరుగులు చేయగా అందులో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదారు.