News October 5, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News November 5, 2024
చీటింగ్ చేసేందుకే ఆ చట్టం తెచ్చారు: ఎలాన్ మస్క్
అమెరికా ఎన్నికల పోలింగ్ జరగనున్న వేళ కాలిఫోర్నియా గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త రూల్‌ను ఎలాన్ మస్క్ లేవనెత్తారు. నెల రోజుల క్రితమే అక్కడ ఎన్నికలలో IDని చూపించడాన్ని చట్టవిరుద్ధం చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది. ఓటింగ్‌లో చీటింగ్ చేసేందుకే ఇది తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. ప్రతిచోట ఐడీ చూపించాలని నిబంధన పెట్టి, ఎంతో ముఖ్యమైన ఓటింగ్ సమయంలో చూపించడం నేరమంటే ఎలా అని నెటిజన్లు మండిపడుతున్నారు.
News November 5, 2024
సిక్కులు, హిందువుల విభజనే ఖలిస్థానీల టార్గెట్: కెనడా మాజీ మంత్రి
కెనడాలో సిక్కులు, హిందువులను విడదీయడమే ఖలిస్థానీల టార్గెట్ కావొచ్చని ఆ దేశ మాజీమంత్రి ఉజ్జల్ దేవ్ దోసాంజి అన్నారు. అక్కడి విభజన విత్తనాన్ని మెల్లగా భారత్‌లో నాటాలన్నదే ప్లాన్ అని పేర్కొన్నారు. ఖలిస్థానీ ఇష్యూపై అక్కడి నేతలు నిద్ర నటిస్తున్నారని, కనీసం ఆ పేరే ఎత్తడం లేదని విమర్శించారు. చాన్నాళ్లుగా ఖలిస్థానీ తీవ్రవాదం మరుగున పడిందని, ట్రూడో రాగానే మళ్లీ మొదలైందని వివరించారు.
News November 5, 2024
ఈ రెండు నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఇవే
కార్తీక, మార్గశిర మాసాల కారణంగా ఈ రెండు నెలలు భారీగా వివాహాలు జరగనున్నాయి. నవంబర్ 7, 8, 9, 10, 13, 14, 17, 18, 20, 21, 23, 25, 27, డిసెంబర్ 4, 5, 6, 7, 8, 9, 11, 20, 23, 25, 26 తేదీల్లో శుభకార్యాలకు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా దాదాపు అరకోటి జంటలు ఒక్కటవుతాయని, రూ.6 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని నిపుణులు <<14533225>>అంచనా<<>> వేస్తున్నారు.