News October 18, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News November 3, 2024
అంబులెన్స్ దుర్వినియోగం.. కేంద్ర మంత్రిపై కేసు
లోక్‌సభ ఎన్నికల వేళ అంబులెన్స్‌ను దుర్వినియోగం చేసినందుకు కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేరళ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. గతంలో త్రిసూర్ BJP MP అభ్యర్థిగా బరిలో ఉన్న సురేశ్ స్థానికంగా పూరం ఉత్సవానికి సొంత వాహనంలో కాకుండా అంబులెన్స్‌లో వెళ్లారని ఆరోపణలు ఉన్నాయి. దీన్ని అధికార, విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. అంబులెన్స్ ఉపయోగించలేదని ఒకసారి, ఉపయోగించినట్లు మరోసారి గోపీ అంగీకరించారు.
News November 3, 2024
ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారుల వివరాలు ఎక్కడంటే?
TG: ఈ నెల 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కానుందని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొంది. తొలుత ఇళ్ల స్థలం ఉన్నవారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది. రెండో విడతలో స్థలం లేనివారికి స్థలమిచ్చి రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని పేర్కొంది. ప్రత్యేక యాప్‌లో లబ్ధిదారుల వివరాలు వెల్లడిస్తామంది.
News November 3, 2024
PUSHPA-2: మిగిలింది సాంగ్ ఒక్కటే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప-2’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రం ముగింపు దశకు చేరుకుందని, కేవలం స్పెషల్ సాంగ్ చిత్రీకరణ మిగిలి ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో శ్రద్ధా కపూర్‌తో పాటు శ్రీలీల కూడా కనిపించనున్నారని, ఈ వారంలోనే షూటింగ్ జరుగుతుందని సమాచారం.