News October 25, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి

Similar News

News November 8, 2024

‘పుష్ప-2’ ఐటమ్ సాంగ్ ఫొటో లీక్?

image

‘పుష్ప-2’ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుంది. ప్రస్తుతం ఐటం సాంగ్ చిత్రీకరిస్తుండగా దానికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సెట్‌లో అల్లు అర్జున్‌తో కలిసి శ్రీలీల స్టెప్పులేస్తున్నట్లుగా ఇందులో కనిపించింది. బన్నీ డిఫరెంట్ కాస్ట్యూమ్‌తో కనిపిస్తున్నారు. ఈ సాంగ్ వీడియో కూడా లీకైందని కొందరు పోస్టులు చేస్తున్నారు. మరికొందరేమో ఇలా లీక్ చేయడం కరెక్ట్ కాదని, ఫేక్ అని కామెంట్లు చేస్తున్నారు.

News November 8, 2024

అక్రమంగా 20.95 ఎకరాల్లో రెడ్ గ్రావెల్ తవ్వకం

image

AP: ఏలూరు(D) ఐ.ఎస్.జగన్నాథపురంలో 20.95 ఎకరాల్లో అక్రమంగా రెడ్ గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. Dy.CM పవన్ ఆదేశాలతో రెవెన్యూ, గనుల శాఖ విచారణ చేపట్టగా, బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ అనుమతులు లేకుండా 6 లక్షల క్యూబిక్ మీటర్ల రెడ్ గ్రావెల్ తవ్వకం సాగించినట్లు గుర్తించారు. ఇందుకు బాధ్యులైన అధికారులకు, ఇన్ఫ్రా సంస్థకు నోటీసులు ఇస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

News November 8, 2024

మొసళ్ల మధ్యలో పడిన క్రికెట్ దిగ్గజం.. త్రుటిలో ఎస్కేప్!

image

ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం ఇయాన్ బోథమ్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మెర్వ్ హ్యూస్‌తో కలిసి ఆయన ఇటీవల ఆ దేశంలో పర్యటించారు. మొసళ్లతో కూడిన చెరువులో పడవ మీద వెళ్తుండగా జారి నీటిలో పడిపోయారు. వెంటనే హ్యూస్ ఆయన్ను బయటికి లాగారు. ఈ క్రమంలో బోథమ్‌కు గాయాలయ్యాయి. తాను బాగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.