News November 7, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News December 7, 2024
గాజాలో మిన్నంటిన ఆకలి కేకలు
ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రజలు ఆహారం లేక అలమటిస్తున్నారు. ఖాన్ యూనిస్‌లో ఉన్న శరణార్థి శిబిరంలోని ఉచిత ఆహారం పంపిణీ చేస్తున్నా ఏమాత్రం సరిపోవడం లేదు. ఆ శిబిరం వద్ద మహిళలు, బాలికలు ఆహారం కోసం పోటీపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఇప్పటివరకు ఐక్యరాజ్యసమితి ఆహారం పంపిణీ చేసింది. కానీ ఇటీవల దానిని నిలిపివేసింది. దీంతో అక్కడి ప్రజలకు ఆహారం అందటం లేదు.
News December 7, 2024
‘RRR’ రికార్డును బద్దలుకొట్టిన ‘పుష్ప-2’
ఓపెనింగ్ డేలో రూ.294 కోట్లు <<14809048>>కొల్లగొట్టిన<<>> పుష్ప-2 భారత సినీ చరిత్రలో తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డ్ RRR పేరిట ఉండేది. ఆ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.223 కోట్లు రాబట్టింది. తాజాగా ఆ రికార్డ్‌ను పుష్పరాజ్ బద్దలుకొట్టారు. ఇక నిన్న, ఇవాళ కలిపి ఈ చిత్రం రూ.400 కోట్లపైనే వసూళ్లు చేసే అవకాశం ఉందని సినీవర్గాలు అంటున్నాయి.
News December 7, 2024
నేడు నల్గొండ జిల్లాకు సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటిస్తారు. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తారు. అలాగే జిల్లాలో చేపట్టబోయే మరో 3 ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనులకు CM అక్కడే శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్ ప్లాంట్ యూనిట్-2ను ప్రారంభిస్తారు. అనంతరం నల్గొండలోని SLBC గ్రౌండ్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు.