News November 9, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News December 10, 2024
STOCK MARKETS: ఆటో, మీడియా షేర్లు డౌన్
స్టాక్‌మార్కెట్ సూచీలు ఫ్లాటుగా మొదలయ్యాయి. సెన్సెక్స్ 81,576 (+68), నిఫ్టీ 24,636 (+20) వద్ద ట్రేడవుతున్నాయి. ఆటో, మీడియా, O&G సూచీలు ఎరుపెక్కాయి. ఫైనాన్స్, IT, ఫార్మా, రియాల్టి, హెల్త్‌కేర్ రంగాలు కళకళలాడుతున్నాయి. నిఫ్టీ ADV/DEC రేషియో 29:21గా ఉంది. శ్రీరామ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, INFY, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్. M&M, ONGC, GRASIM, BAJAJ AUTO, TECHM టాప్ లూజర్స్.
News December 10, 2024
ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల ఫొటోలు ప్రదర్శించాలి: విద్యాశాఖ
TG: ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల ఫొటోలు, వివరాలను ఆయా స్కూళ్లలో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నకిలీ టీచర్లు, ఫేక్ అటెండెన్స్‌ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. వివరాలు ప్రదర్శించడం వల్ల టీచర్ల వివరాలు విద్యార్థులతో పాటు తనిఖీలకు వచ్చే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు కూడా తెలుస్తాయని భావిస్తోంది.
News December 10, 2024
ఎంపీతో తన స్థాయి తగ్గిందన్న కృష్ణయ్య.. మళ్లీ అదే పదవి!
బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య BJP నుంచి రాజ్యసభ స్థానాన్ని తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన YCPకి, రాజ్యసభకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కృష్ణయ్య <<14226660>>మాట్లాడుతూ<<>> తన 50 ఏళ్ల పోరాటంలో ఎంపీ చిన్న పదవని చెప్పారు. దాని వల్ల తన స్థాయి తగ్గిందన్న ఆయన ఇప్పుడు మళ్లీ అదే పదవి తీసుకోవడం కరెక్టేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. TDP, YCP, ఇప్పుడు బీజేపీలో చేరికపై విమర్శిస్తున్నారు.