News December 3, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 25, 2026

సంజూకు ఇషాన్‌తో ముప్పు!

image

NZతో జరుగుతున్న T20 సిరీస్‌లో తొలి 2 మ్యాచుల్లో ఓపెనర్ శాంసన్ అనుకున్నస్థాయిలో రాణించలేదు. తొలి T20లో 10, రెండో దాంట్లో 6 పరుగులే చేశారు. ఇలాగే బ్యాడ్ ఫామ్ కంటిన్యూ చేస్తే మరో ఓపెనర్ అభిషేక్‌పై ఒత్తిడి పడే ఆస్కారముంది. దీంతో ఇవాళ శాంసన్ ఆశించిన మేర రన్స్ చేయకపోతే ఇషాన్‌తో రీప్లేస్ చేయొచ్చని క్రీడావర్గాలు భావిస్తున్నాయి. అతను కీపింగ్ కూడా చేయడం వల్ల సంజూకు మరింత ముప్పు పొంచి ఉందనే టాక్ నడుస్తోంది.

News January 25, 2026

220 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

చెన్నై ఆవడిలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ 220 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 13 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ పే 21,000+IDA చెల్లిస్తారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://avnl.co.in లేదా www.ddpdoo.gov.in

News January 25, 2026

వాట్సాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు

image

⋆ వాట్సాప్‌లో ‘సెకండరీ అకౌంట్స్’ ఫీచర్ రానుంది. పిల్లల కోసం పేరెంట్స్ ఈ అకౌంట్స్ క్రియేట్ చేయవచ్చు. వీటిలో స్టేటస్/ఛానల్ అప్‌డేట్స్ రావు. కాంటాక్ట్స్‌లో లేని వారితో చాట్ చేయరాదు.
⋆ IOS యూజర్లకు చాట్ హిస్టరీ షేరింగ్ ఆప్షన్ రానుంది. గ్రూప్‌లో ఆల్రెడీ ఉన్నవాళ్లు కొత్త మెంబర్‌కి 100 మెసేజ్‌లను షేర్ చేయొచ్చు.
⋆ యూరప్, UKలో యాడ్ ఫ్రీ ఫీచర్ రానుంది. డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే యాడ్స్ రావు.