News December 30, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 13, 2025

రష్యాపై US ఆంక్షలు.. భారత్, చైనాపై ప్రభావం!

image

ర‌ష్యా చ‌మురు ప‌రిశ్ర‌మ‌పై US విధించిన తాజా ఆంక్ష‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రభావం చూపనున్నాయి. 2022 నుంచి చౌకగా లభిస్తున్న రష్యా చమురుకు ప్రధాన దిగుమతిదారులుగా ఉన్న భారత్, చైనాలకు ఈ ఆంక్షలు ప్రతికూలంగా పరిణమించాయి. చైనా షాన్‌డాంగ్‌లోని స్వతంత్ర చమురు సంస్థలు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. భారత్‌ అవసరాల్లో మూడోవంతు రష్యా నుంచే వస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలపై ప్రభుత్వం నిపుణులతో చర్చిస్తోంది.

News January 13, 2025

Thank You పవన్ కళ్యాణ్: YCP

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వైసీపీ థాంక్స్ చెప్పింది. జగన్ హయాంలో చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేస్తూ ఆయన తమకు స్టార్ క్యాంపెయినర్‌గా మారారని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. స్కూళ్లు, కర్నూలులో గ్రీన్‌కో సోలార్ ప్రాజెక్టు, పంప్ స్టోరేజ్, విశాఖలో రుషికొండ భవనాల వద్ద ఆయన ఫొటోలను షేర్ చేసింది. కాగా తమ ప్రభుత్వంలో పూర్తిచేసిన కార్యక్రమాలపై వైసీపీ ఇవాళ్టి నుంచి క్యాంపెయిన్ ప్రారంభించింది.

News January 13, 2025

మరోసారి తగ్గనున్న మద్యం ధరలు!

image

APలో మద్యం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. లిక్కర్ బ్రాండ్లలో ధరల తగ్గింపునకు కంపెనీలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే మాన్షన్ హౌస్, అరిస్ట్రోకాట్ ప్రీమియం, కింగ్ ఫిషర్ వంటివి ధరలు తగ్గించుకోగా, బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ ధరల తగ్గింపునకు ప్రభుత్వానికి అప్లై చేసుకుంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.