News January 6, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 18, 2025

గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

TG: రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. జాబితాలో పేరు లేనివారు ఆందోళన చెందొద్దని, గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కులగణన ఆధారంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కార్డు ఇస్తామని స్పష్టం చేశారు. ఇక పాత రేషన్ కార్డులు తొలగిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపైనా ఉత్తమ్ స్పందించారు. అలాంటిదేమీ ఉండదని, పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేరుస్తామని చెప్పారు.

News January 18, 2025

అతనొక్కడే దోషి కాదు.. ట్రైనీ డాక్టర్ తల్లి

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌ని కోర్టు దోషిగా తేల్చడంపై బాధితురాలి తల్లి హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ దారుణం వెనుక మరికొందరు ఉన్నారని ఆమె ఆరోపించారు. వారికి కూడా శిక్ష పడ్డప్పుడే న్యాయం జరిగినట్లు భావిస్తామన్నారు. అప్పటివరకు తాము ప్రశాంతంగా నిద్రపోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ కేసులో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు.

News January 18, 2025

రంజీ మ్యాచ్ ఆడనున్న రోహిత్‌శర్మ

image

ముంబై తరఫున రంజీ మ్యాచ్ ఆడనున్నట్లు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. CT జట్టు ప్రకటన సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కొద్దిరోజుల క్రితం హిట్‌మ్యాన్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. జనవరి 23 నుంచి జమ్మూకశ్మీర్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగనున్నారు. కాగా 2015లో చివరిసారి అతడు రంజీట్రోఫీలో ఆడారు.