News January 26, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
Similar News
News February 15, 2025
గాంధీ కంటే ముందే సేవాలాల్ అహింస పాటించారు: సీఎం

సంత్ సేవాలాల్ APలో పుట్టినా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ సేవ చేశారని CM చంద్రబాబు కొనియాడారు. సచివాలయంలో జరిగిన సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మహాత్మాగాంధీ కంటే ముందే సేవాలాల్ అహింస పాటించారని చెప్పారు. బ్రిటీష్ కాలంలో మతమార్పిడులపై పోరాడారని, ఈనాడు మనం ఆచరిస్తున్న ఆర్థిక విధానాలను ఆయన అప్పుడే బోధించారని పేర్కొన్నారు. గిరిజనుల్లోని వెనుకబాటును తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
News February 15, 2025
టెన్త్ పాసైతే 32,438 ఉద్యోగాలు.. వారం రోజులే ఛాన్స్

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 32,438 లెవల్-1 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ లేదా ఐటీఐ పాసైన వారు అర్హులు. వయసు 18-36 ఏళ్ల మధ్య ఉండాలి. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు. మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. ENGతో పాటు తెలుగులోనూ పరీక్ష రాయొచ్చు. <
News February 15, 2025
రాహుల్ గాంధీకి కులం లేదు, మతం లేదు: బండి సంజయ్

TG: ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, దేశం లేదు అంటూ విరుచుకుపడ్డారు. ‘రాహుల్ తాత పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ. తల్లి సోనియా గాంధీ క్రైస్తవురాలు, ఇటలీ దేశస్థురాలు. రాహుల్ కులం మీద రేవంత్ ఏం సమాధానం చెప్తారు’ అని ప్రశ్నించారు.