News January 28, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

Similar News

News February 13, 2025

ప్రభాస్ న్యూ లుక్ అదిరిందిగా..!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ‘ఫౌజీ’ సినిమాలో తాను నటిస్తున్నట్లు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తెలిపారు. డార్లింగ్‌, డైరెక్టర్‌తో దిగిన ఫొటోలను ఆయన Xలో షేర్ చేశారు. ఇప్పటివరకూ ఈ చిత్రంలోని ప్రభాస్ లుక్ రివీల్ కాలేదు. ఫొటోలో సైడ్ క్రాఫ్ హెయిర్ స్టైల్‌తో ట్రిమ్మ్‌డ్ బియర్డ్‌తో ఫార్మల్‌ డ్రైస్‌లో డార్లింగ్ కనిపించారు. ప్రభాస్ లుక్ బాగుందని ఫ్యాన్స్ అంటున్నారు.

News February 13, 2025

ఇలాంటి డాక్టర్లు చాలా అరుదు!

image

వైద్యాన్ని వ్యాపారం చేసిన ఈ రోజుల్లో పేదలకు ఉచిత వైద్యసేవలు అందిస్తూ ఎంతో మందికి పునర్జన్మనిచ్చారు వారణాసికి చెందిన డా.తపన్ కుమార్ లాహిరి. 2003లోనే ఆయన రిటైర్ అయినప్పటికీ 83 ఏళ్ల వయసులోనూ రోగులకు సేవలందిస్తున్నారు. 1994 నుంచి తన జీతం మొత్తాన్ని నిరుపేదల కోసం విరాళంగా ఇచ్చి పెన్షన్‌తో జీవిస్తున్నారు. రోజూ ఉదయం గొడుగు పట్టుకొని నడుస్తూ క్లినిక్‌కు వెళ్తుంటారు. ఆయనను 2016లో పద్మశ్రీ వరించింది.

News February 13, 2025

స్టార్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఇంట విషాదం

image

భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్, ఖేల్ రత్న పురస్కార గ్రహీత మనికా బత్రా ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి గిరీశ్ బత్రా(65) కార్డియాక్ అరెస్ట్‌తో ఢిల్లీలో కన్నుమూశారు. దీంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న మనికా సహచరులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ధైర్యం చెబుతూ SMలో పోస్టులు పెడుతున్నారు.

error: Content is protected !!