News February 21, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

Similar News

News March 20, 2025

రాష్ట్రంలో నేడు తేలికపాటి వర్షాలు

image

ఎండ వేడిమితో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఇవాళ ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 22, 23న రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందన్నారు. తెలంగాణలో రేపటి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది.

News March 20, 2025

గ్రోక్ బూతులు.. వివరణ కోరిన కేంద్రం

image

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో AI చాట్‌బాట్ (గ్రోక్) సృష్టిస్తున్న వివాదాస్పద ప్రతిస్పందనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల గ్రోక్ హిందీలో అభ్యంతకర రీతిలో బూతు రిప్లైలు ఇచ్చింది. దీంతో గ్రోక్ హిందీ యాస దుర్వినియోగంపై కేంద్రం స్పందించింది. గ్రోక్ ఉత్పత్తి చేసిన ఆన్సర్లు, చాట్‌బాట్‌కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించిన డేటాకు సంబంధించి ఐటీ మంత్రిత్వ శాఖ ఆ సంస్థ నుంచి వివరణ కోరింది.

News March 20, 2025

ఫ్రీ బస్సు స్కీమ్ ఉండాలా? వద్దా?

image

APలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకాన్ని అమలు చేయవద్దని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. తెలంగాణలో ఈ స్కీమ్ వల్ల వస్తోన్న ఇబ్బందులను చూస్తున్నామని, ఉచిత పథకాలను ప్రోత్సహించవద్దని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేవలం జిల్లా పరిధిలోనే ఫ్రీ బస్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. బస్సుల సంఖ్యనూ పెంచుతోంది. దీనిపై మీ కామెంట్?

error: Content is protected !!