News February 27, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

Similar News

News March 19, 2025

రేవంత్‌పై నమోదైన కేసు కొట్టివేత

image

TG: గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది. 2020 మార్చిలో జన్వాడలో డ్రోన్ ఎగురవేశారని రేవంత్‌తో సహా పలువురిపై రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పీఎస్‌లో కేసు నమోదైంది. అలాగే రేవంత్‌ను కించపరిచే విధంగా మాట్లాడారని సైఫాబాద్ పీఎస్‌లో కేటీఆర్‌పై నమోదైన కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది.

News March 19, 2025

బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ

image

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో సమావేశమయ్యారు. వీరిద్దరు సుమారు 40 నిమిషాల పాటు పలు ఒప్పందాలపై చర్చించారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఉద్యోగాల కల్పనలో ఏఐ వినియోగంపై సమాలోచనలు జరిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కలిసివస్తుందని CBN పేర్కొన్నారు.

News March 19, 2025

చాహల్-ధనశ్రీ విడాకులపై రేపు తీర్పు

image

చాహల్, ధనశ్రీ విడాకుల పిటిషన్‌పై రేపటిలోగా తీర్పు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది. కూలింగ్ ఆఫ్ వ్యవధిని మినహాయించాలన్న పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించగా, ఆ నిర్ణయాన్ని HC రద్దు చేసింది. చాహల్ IPLలో పాల్గొనాల్సి ఉన్నందున రేపటిలోగా తీర్పు ఇవ్వాలని సూచించింది. 2020లో వీరికి పెళ్లవగా, కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. చాహల్ రూ.4.75కోట్ల భరణం చెల్లించడానికి అంగీకరించారు.

error: Content is protected !!