News March 14, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News March 24, 2025

రాజ్యాంగ మార్పు: DK, రాహుల్‌పై మండిపడ్డ BJP

image

కాంగ్రెస్ నేత DK శివకుమార్‌ రాజ్యాంగ మార్పు వ్యాఖ్యలపై BJP మండిపడుతోంది. ‘ముస్లిం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని మార్చేందుకు కాంగ్రెస్ రెడీగా ఉందని DK అంగీకరించారు. ఆ పార్టీ రాజ్యాంగానికి పెద్ద ముప్పు. అది అంబేడ్కర్, SC, ST, OBC వ్యతిరేకి’ అని షెజాద్ విమర్శించారు. ‘కాంగ్రెస్‌కు జాతీయ ప్రయోజనం కన్నా ముస్లిముల బుజ్జగింపే ప్రధానం. రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ ఎక్కడ’ అని అమిత్ మాలవీయ ప్రశ్నించారు.

News March 24, 2025

క్రికెటర్ తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు

image

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు వచ్చింది. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇవాళ మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి ఈసీజీ, తదితర స్కానింగ్స్ చేయించారు. ప్రస్తుతం తమీమ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

News March 24, 2025

దీపక్ చాహర్‌పై ఆసక్తికర పోస్ట్ చేసిన సోదరి

image

కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచే మీమ్‌ని ముంబై క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి మాలతీ చాహర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. నిన్న జరిగిన MI-CSK మ్యాచ్‌లో దీపక్ 25పరుగులతో పాటు ఒక వికెట్ తీసి చెన్నైకు సులువుగా విజయం దక్కకుండా అడ్డుకున్నారు. గత 7 సీజన్లలో CSK జట్టులో ఉన్న దీపక్ ప్రస్తుతం ముంబై తరపున ఆడుతున్నారు. దీంతో ఇన్నాళ్లూ ఆడిన జట్టుకు ద్రోహం చేస్తున్నట్లు అర్థం వచ్చేలా ఆమె ఫన్నీ మీమ్ షేర్ చేశారు.

error: Content is protected !!