News March 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News April 22, 2025
‘రాజాసాబ్’ టీజర్ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘రాజాసాబ్’ Xలో ట్రెండవుతోంది. ఈ చిత్ర టీజర్ మేలో రాబోతున్నట్లు సినీవర్గాలు పేర్కొనడంతో అభిమానులు దీనిపై ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇండియన్ సినిమాలో ఇంతవరకూ చూడని విజువల్స్, VFXను టీజర్‌లో చూపించారని వార్తలొస్తున్నాయి. అయితే, టీజర్ కట్, సీజీ పనులు పూర్తయ్యాయని, ప్రభాస్ డబ్బింగ్ చెప్పడమే మిగిలి ఉందని సమాచారం.
News April 22, 2025
నీరజ్ చోప్రా జావెలిన్ ఈవెంట్‌కు పాక్ అథ్లెట్!

ఒలింపిక్ హీరో నీరజ్ చోప్రా జావెలిన్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మే నెలలో బెంగళూరులో JSW స్పోర్ట్స్ ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేయబోతోంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ జావెలిన్ క్రీడాకారులను ఆహ్వానిస్తున్నారు. పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌ని కూడా ఆహ్వానించినట్లు నీరజ్ తెలిపారు. కోచ్‌తో మాట్లాడి కన్ఫార్మ్ చేస్తానని ఆయన చెప్పారని పేర్కొన్నారు.
News April 22, 2025
నేడు ఇంటర్నేషనల్ ఎర్త్ డే

ప్రతి ఏటా ఏప్రిల్ 22న ఇంటర్నేషనల్ ఎర్త్ డే నిర్వహిస్తారు. 1970లో ఇదే రోజున USAలో దాదాపు 2 కోట్ల మంది వీధుల్లోకి వచ్చి పర్యావరణానికి జరుగుతున్న హానిపై నిరసన తెలిపారు. అప్పటి నుంచి ఎర్త్ డేను నిర్వహిస్తున్నారు. ‘భూమి మానవుడిది మాత్రమే కాదు. సకల జీవరాశులకు నిలయమని గుర్తుంచుకుందాం. అభివృద్ధి పేరుతో కాంక్రీట్ జంగిల్స్‌లా మార్చేసి జంతువుల గూడును చెరపొద్దు’ అని ప్రకృతి ప్రేమికులు సూచిస్తున్నారు.