News April 24, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News November 18, 2025

2015 గ్రూప్-2 సెలక్షన్ లిస్ట్ రద్దు: హైకోర్టు

image

TG: 2015లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలపై HC కీలక తీర్పు ఇచ్చింది. 2019లో ఇచ్చిన సెలక్షన్ లిస్ట్‌‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2015లో గ్రూప్-2 OMR షీట్ ట్యాంపరింగ్‌కు గురైందంటూ పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఆదేశాలను TGPSC ఉల్లంఘించిందని ఇవాళ తీర్పు సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. OMR షీట్లను రీవాల్యుయేషన్ చేసి 8 వారాల్లో మళ్లీ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని TGPSCని ఆదేశించింది.

News November 18, 2025

గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ భారత్‌కు అప్పగింత

image

లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. అధికారులు అతడిని ఇండియాకు తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో అన్మోల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సిద్దిఖీ కొడుకు జీషన్ US కోర్టులో పిటిషన్ వేయడంతో అన్మోల్‌ను భారత్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.

News November 18, 2025

రేపటి నుంచి ఇందిరమ్మ చీరలు పంపిణీ: సీఎం రేవంత్

image

TG: ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రేపటి నుంచి మహిళలకు చీరల పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. HYD నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా విగ్రహం వద్ద మ.12 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. రేపటి నుంచి డిసెంబర్ 9వరకు గ్రామీణ ప్రాంతాల్లో, మార్చి 1 నుంచి 8 వరకు పట్టణాల్లో మొత్తంగా కోటి మందికి రెండు విడతల్లో చీరలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.