News April 24, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 20, 2025

విశ్వవిజేతలుగా భారత్: తెలుగోడి కీలక పాత్ర

image

ఖో ఖో WCలో భారత మహిళల జట్టు విజయంలో తెలుగు వ్యక్తి ఇస్లావత్ నరేశ్ పాత్ర ఉంది. TGలోని పెద్దపల్లి(D) ధర్మారంలోని బంజరపల్లికి చెందిన నరేశ్ జట్టుకు సహాయ కోచ్‌గా ఉన్నారు. 1995లో క్రీడాకారుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన 2015లో కోచ్‌గా మారారు. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాగా అంచెలంచెలుగా జాతీయ జట్టుకు సహాయ కోచ్‌గా ఎదిగారు. స్కిల్ అనలైజర్‌గా ఆటగాళ్ల తప్పులు, బలహీనతలను సరిచేయడంలో ఆయనదే ముఖ్య పాత్ర.

News January 20, 2025

ALERT.. రేపు, ఎల్లుండి జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. రానున్న రెండ్రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం పూట పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

News January 20, 2025

కొత్త పథకాలకు లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే: భట్టి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. అర్హులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా సాయం అందిస్తామని వెల్లడించారు. భూమి లేని నిరుపేదలకు ఖాతాల్లో ఏటా రూ.12వేలు జమచేస్తామని పేర్కొన్నారు.