News April 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News April 17, 2026
మోదీతో మల్లారెడ్డి భేటీ.. కోడలు కోసమేనా?

TG: తన కోడలు ప్రీతిరెడ్డితో కలిసి BRS ఎమ్మెల్యే మల్లారెడ్డి నిన్న ప్రధాని మోదీతో భేటీ కావడం కొత్త చర్చకు దారితీసింది. ప్రీతిరెడ్డికి ఎంపీ సీటు కోరేందుకే ఆయన మోదీని కలిశారని రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. తనకు ఎంపీ అవ్వాలని ఉందంటూ గతంలో ప్రీతి చేసిన కామెంట్స్‌ను, బండి సంజయ్‌ని కలవడాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు. అదే జరిగితే మల్లారెడ్డి కూడా BJPలోకి వెళ్తారా? అనే ప్రశ్నా తలెత్తుతోంది.
News April 17, 2026
పాక్‌లో టెర్రరిస్టుల ‘మిస్టరీ హత్యలు’.. చేస్తోంది ఎవరు?

భారత శత్రువులకు <<19670303>>పాక్<<>> గడ్డ ఇప్పుడు వల్లకాడుగా మారుతోంది. కొన్నాళ్లుగా ముసుగు ధరించిన ‘అజ్ఞాత వ్యక్తులు’ పక్కా స్కెచ్‌తో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అంతం చేస్తున్నారు. ISI నీడలో ఉన్నా ప్రాణాలు తీస్తుండటంతో ఉగ్ర ముఠాల్లో వణుకు మొదలైంది. ఈ ‘మిస్టరీ హత్యల’ వెనుక భారత ఏజెన్సీలు ఉన్నాయని పాక్ ఆరోపిస్తున్నా.. ఇండియా కొట్టిపారేస్తోంది. ఈ ఆపరేషన్లు చేస్తోంది ఎవరనేది మిస్టరీగా మారింది. దీనిపై మీ Comment
News April 17, 2026
ప్రెగ్నెన్సీలో కాళ్ల వాపులు ఎందుకొస్తాయంటే?

గర్భిణుల్లో రక్త హీనత ఉన్నా, రక్తపోటు పెరిగినప్పుడు తరచూ చాలా మంది కాళ్లలో వాపు వస్తుంది. గర్భసంచి, బేబీ బరువుతో కొన్నిసార్లు కాళ్లవాపు వస్తుంది. మెల్లగా కాకుండా ఒక్కరోజులోనే కాళ్లు బాగా వాచిపోవడం, నొక్కితే సొట్ట పడిన తర్వాత అది మళ్లీ మామూలు స్థితికి రావడానికి ఎక్కువ సమయం పడినప్పుడు జాగ్రత్త పడాలి. రెండుకాళ్లు కాకుండా ఒక కాలే వాస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.


