News August 11, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News August 13, 2025

రీ పోలింగ్‌ను బహిష్కరిస్తున్నాం: అవినాశ్

image

AP: 2 కేంద్రాల్లో రీ పోలింగ్ అంటూ ఎన్నికల కమిషన్ కంటితుడుపు చర్య తీసుకుందని YCP MP అవినాశ్ రెడ్డి విమర్శించారు. తాము 15 చోట్ల కోరితే 2 చోట్ల పోలింగ్ చేపట్టారని, దీన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. ‘కోర్టుకు ఏదో కారణం చెప్పడానికే రీ పోలింగ్‌ చేపట్టింది. ఓటర్ స్లిప్పులు లాక్కొని దొంగ ఓట్లు వేశారు. ఇలాంటి ఎన్నిక ఎక్కడా జరిగి ఉండదు. పులివెందులలో బాబు కొత్త సంస్కృతి తీసుకొచ్చారు’ అని ఫైర్ అయ్యారు.

News August 13, 2025

వచ్చే నెల ట్రంప్‌‌తో మోదీ భేటీ?

image

PM మోదీ వచ్చే నెల USలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్‌లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(UNGA) సమ్మిట్‌‌‌లో భాగంగా SEP 23 నుంచి జరిగే హైలెవల్ మీటింగ్‌‌లో PM పాల్గొంటారని సమాచారం. ఆ సమయంలో US ప్రెసిడెంట్ ట్రంప్‌ని కలిసి ట్రేడ్ డీల్, టారిఫ్స్‌పై చర్చించే అవకాశముంది. అలాగే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీని కూడా PM కలవొచ్చని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.

News August 13, 2025

‘నవోదయ’లో ప్రవేశాలు.. నేడే చివరి తేదీ

image

దేశ వ్యాప్తంగా 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో(JNV) ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే చివరి తేదీ. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఇటీవలే గడువు ముగియగా విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా మళ్లీ పొడిగించారు. ఆసక్తి ఉన్నవారు ఇక్కడ <>క్లిక్<<>> చేసి అప్లై చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 13న, J&K సహా పలు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో 2026 ఏప్రిల్ 11న ప్రవేశ పరీక్ష జరగనుంది.