News August 11, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News August 13, 2025

APPLY: ఇండియన్ నేవీలో 1,266 జాబ్స్

image

ఇండియన్ నేవీ 1,266 సివిలియన్ ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతి పాసై ITI సర్టిఫికెట్/ సంబంధిత విభాగంలో శిక్షణ పొంది 18-25 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ల వారీగా వయసు సడలింపు ఉంటుంది. నేటి నుంచి సెప్టెంబర్ 2 వరకు <>indiannavy.gov.in<<>> సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. జీతం రూ.19,900-రూ.63,200 వరకు ఉంటుంది. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. SHARE IT.

News August 13, 2025

మద్యం వినియోగంలో తెలంగాణ టాప్

image

TG: మద్యం వినియోగంలో రాష్ట్రం దేశంలోనే టాప్‌లో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి సగటున ఏడాదికి విదేశీ మద్యం, బీరు కోసం రూ.3,061 ఖర్చు చేస్తున్నట్లు NIPFP స్టడీలో తేలింది. జాతీయ సగటు రూ.486 ఉండటం గమనార్హం. అలాగే రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో సిగరెట్ల కోసం యావరేజ్‌గా ఏడాదికి రూ.624 ఖర్చు చేస్తున్నారు. మరోవైపు వార్షిక వ్యక్తిగత వినియోగ ఖర్చులో సిక్కిం (రూ.1,45,261) అగ్రస్థానంలో ఉంది.

News August 13, 2025

రీ పోలింగ్‌ను బహిష్కరిస్తున్నాం: అవినాశ్

image

AP: 2 కేంద్రాల్లో రీ పోలింగ్ అంటూ ఎన్నికల కమిషన్ కంటితుడుపు చర్య తీసుకుందని YCP MP అవినాశ్ రెడ్డి విమర్శించారు. తాము 15 చోట్ల కోరితే 2 చోట్ల పోలింగ్ చేపట్టారని, దీన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. ‘కోర్టుకు ఏదో కారణం చెప్పడానికే రీ పోలింగ్‌ చేపట్టింది. ఓటర్ స్లిప్పులు లాక్కొని దొంగ ఓట్లు వేశారు. ఇలాంటి ఎన్నిక ఎక్కడా జరిగి ఉండదు. పులివెందులలో బాబు కొత్త సంస్కృతి తీసుకొచ్చారు’ అని ఫైర్ అయ్యారు.