News April 20, 2024
CBNకు జనసేనాని పుట్టినరోజు శుభాకాంక్షలు

TDP అధినేత చంద్రబాబుకు జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘రాజకీయంగా, పరిపాలనాపరంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు నిరంతరం రాష్ట్రం గురించే ఆలోచిస్తారు. రాజకీయ ఒత్తిళ్లు, వేధింపులు ఎన్ని ఎదురైనా దృఢ చిత్తంతో ఎదుర్కొంటారు. వైసీపీ సర్కారు బనాయించిన కేసులతో కారాగారంలో ఉన్నప్పుడూ మనో నిబ్బరం కోల్పోలేదు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ని కోరుకుంటున్నా’ అని తెలిపారు.
Similar News
News March 23, 2026
జిల్లాలో పర్యాటక అభివృద్ధికి చర్యలు వేగవంతం: కలెక్టర్

అనంతపురం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. శిల్పారామంలో మౌలిక వసతులు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. గుత్తి, కుందుర్పి కోటల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. అనంతసాగరం చెరువులో బోటింగ్ ప్రారంభించాలన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మరుగుదొడ్లు, సమాచారం బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
News March 23, 2026
‘ధురంధర్-2’: 4 రోజుల్లోనే రూ.761కోట్లు

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ధురంధర్- 2’ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.761కోట్లు(గ్రాస్) సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఇండియాలోనే రూ.550కోట్లు రావడం విశేషం. తొలి 2,3 రోజులతో పోల్చితే నాలుగో రోజు(ఆదివారం) భారీగా కలెక్షన్లు వచ్చినట్లు తెలిపారు. ఈ వీకెండ్‌లోపు రూ.వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉంది.
News March 23, 2026
విపక్షాల ట్రాప్‌లో పడొద్దు: రేవంత్

TG: మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయబోమని సీఎం రేవంత్ అసెంబ్లీలో పునరుద్ఘాటించారు. వారికి మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తామని, విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు వ్యాపారాలు చేసుకోవడానికి సహకరిస్తామన్నారు. విపక్షాల ట్రాప్‌లో పడొద్దని వారికి సూచించారు.


