News November 7, 2024

వెండితెర జేజమ్మకు HAPPY BIRTHDAY

image

సినీ ఇండస్ట్రీలో గ్లామర్‌తో పాటు తనదైన నటనతో ఆకట్టుకున్న అందాల తార అనుష్కశెట్టి. 1981 NOV 7న కర్ణాటకలోని మంగళూరులో స్వీటీ జన్మించారు. సూపర్ సినిమాతో అరంగేట్రం చేశారు. విక్రమార్కుడితో హిట్ అందుకున్న తర్వాత టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. అరుంధతి సినిమా ఆమె కెరీర్‌ను మలుపుతిప్పింది. బాహుబలిలో ధీరవనిత దేవసేన పాత్రతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో అలరించారు.

Similar News

News December 7, 2024

మార్చి 15 నుంచి టెన్త్ ఎగ్జామ్స్?

image

AP: రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చి 15 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని తెలుస్తోంది. కొత్త సిలబస్ ప్రకారమే ఈ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే గతంలో పరీక్ష రాసి ఫెయిలైన వారికి పాత సిలబస్ ప్రకారం పరీక్షలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే వెబ్‌సైట్‌లో ప్రశ్నాపత్రాలు, మోడల్ పేపర్లు, మార్కుల వెయిటేజీ వంటి తదితర వివరాలు పొందుపరిచారు.

News December 7, 2024

18న గురుకుల సొసైటీ ప్రవేశాలకు నోటిఫికేషన్

image

TG: గురుకుల సొసైటీ ప్రవేశాలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు. ఫిబ్రవరి 23న రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. జూన్ 12లోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అలాగే 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలకు ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించడం లేదని వెల్లడించారు. పది పాసైన వారికి నేరుగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

News December 7, 2024

తెలంగాణలోనే ఎక్కువ సిజేరియన్లు

image

తెలంగాణలో సిజేరియన్లు ఎక్కువగా ఉన్నట్లు NFHS ఆధారంగా ఢిల్లీలోని జార్జ్ ఇన్‌స్టిట్యూట్ స్టడీ తెలిపింది. ఇక్కడ మొత్తం ప్రసవాల్లో 60.7% సిజేరియన్లేనని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇది 21.5 శాతంగా ఉంది. అత్యల్పంగా నాగాలాండ్‌లో 5.2% సిజేరియన్లు జరుగుతున్నాయి. దక్షిణాదిలోనే సిజేరియన్లు ఎక్కువగా ఉన్నాయి. సహజ ప్రసవాలపై భయం, ముహూర్తాలు చూసుకోవడం, ఆర్థిక స్తోమత వంటి అంశాలు సిజేరియన్లకు కారణాలవుతున్నాయి.