News January 11, 2025
పండగ హ్యాపీగా జరుపుకోండి ఫ్రెండ్స్!

చదువు, ఉద్యోగాలు, వ్యాపారం కోసం HYDలో స్థిరపడ్డ లక్షలాది మంది సంక్రాంతి కోసం సొంతూళ్లకు వెళ్తున్నారు. రైళ్లు, బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉండటంతో చాలా మంది కార్లు, బైకులపై వెళ్తున్నారు. వీరు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి పూట జర్నీ చేయవద్దు. 80 కి.మీ వేగం దాటొద్దు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడొద్దు. కచ్చితంగా సీటు బెల్ట్ పెట్టుకోవాలి. మద్యం తాగి వాహనం నడపకూడదు.
*క్షేమంగా వెళ్లి లాభంగా రండి.
Similar News
News November 26, 2025
29న ఒంగోలులో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు

ఒంగోలులోని డీఆర్ఆర్ఎం హై స్కూల్లో ఈనెల 29న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులను క్రీడా పోటీలలో సైతం ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.
News November 26, 2025
సర్పంచ్ ఎన్నికలు.. హైకోర్టులో పిటిషన్లు

తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై పలు గ్రామాల ప్రజలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని అందులో పేర్కొన్నారు. వరంగల్, సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లోని గ్రామాల్లో సర్పంచ్, వార్డు రిజర్వేషన్లను సవాల్ చేశారు. దీనిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
News November 26, 2025
గ్లోబల్ సమ్మిట్కు PMను ఆహ్వానించాలి: సీఎం

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభోత్సవానికి PM మోదీ, కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని CM రేవంత్ రెడ్డి సూచించారు. పెట్టుబడులపై ఒప్పందాల విషయంలో ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. వివిధ విభాగాలపై స్టాల్స్, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సమీక్షలో పేర్కొన్నారు. 2,600 మందికి ఆహ్వానం అందించామని CMకు అధికారులు తెలియజేశారు.


