News August 19, 2024

రక్షా బంధన్ శుభాకాంక్షలు: పవన్ కళ్యాణ్

image

AP:శ్రావణ పౌర్ణమి ప్రజలందరికీ శుభాలు కలుగజేయాలంటూ డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘సోదర సోదరి ప్రేమ అనుభవైక్యంతోనే అర్థమవుతుంది. అక్కాచెల్లెమ్మల అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుంది. అన్నదమ్ముల ఆప్యాయతకు ఎవరు వెలకట్టగలరు? జీవితాంతం గుండెల్లో గుడికట్టి పూజించడం తప్ప. అలాంటి అనురాగానికి ప్రతీకైన రక్షా బంధన్ శుభతరుణాన అందరికీ శుభాకాంక్షలు’ అని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News December 4, 2025

BELలో ఇంజినీర్ పోస్టులు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)7 సీనియర్ ఇంజినీర్, డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. డిప్యూటీ ఇంజినీర్ పోస్టులకు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా.. సీనియర్ ఇంజినీర్ పోస్టుకు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://bel-india.in

News December 4, 2025

పిల్లలను ముద్దు పేరుతో పిలుస్తున్నారా?

image

పిల్లలను ముద్దు పేర్లతో కాకుండా సొంత పేర్లతో పిలవడం శుభకరమని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ఆ పేరులోని సానుకూల శక్తి వారికి బదిలీ అవుతుందని అంటున్నారు. ‘పెద్దలు జన్మ నక్షత్రం ప్రకారం నామకరణం చేస్తారు. అందుకే ఆ పేరుతో పిలిస్తే.. ఆ పేరుకు సంబంధించిన గ్రహబలం, శుభ ఫలితాలు వారికి లభిస్తాయి. అలా పిల్వకపోతే ప్రతికూల శక్తులు వారిని ఆకర్షిస్తాయి’ అని చెబుతున్నారు.

News December 4, 2025

డిసెంబర్ 7న ప్రజావంచన దిన నిరసనలు: బీజేపీ

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మొదలై డిసెంబర్ 7 నాటికి రెండేళ్లు కావస్తున్న సందర్భంగా నిర్వహించే ప్రజా పాలన ఉత్సవాలను వ్యతిరేకిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు తెలిపారు. ఆ రోజున ప్రజా వంచన దినంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జ్‌షీట్ విడుదల చేస్తామని ప్రకటించారు.