News August 19, 2024

రక్షా బంధన్ శుభాకాంక్షలు: పవన్ కళ్యాణ్

image

AP:శ్రావణ పౌర్ణమి ప్రజలందరికీ శుభాలు కలుగజేయాలంటూ డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘సోదర సోదరి ప్రేమ అనుభవైక్యంతోనే అర్థమవుతుంది. అక్కాచెల్లెమ్మల అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుంది. అన్నదమ్ముల ఆప్యాయతకు ఎవరు వెలకట్టగలరు? జీవితాంతం గుండెల్లో గుడికట్టి పూజించడం తప్ప. అలాంటి అనురాగానికి ప్రతీకైన రక్షా బంధన్ శుభతరుణాన అందరికీ శుభాకాంక్షలు’ అని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News September 20, 2024

టీటీడీ ఈవోకు చంద్రబాబు ఆదేశం

image

AP: టీటీడీలో నెయ్యి వివాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.

News September 20, 2024

త్వరలోనే EHS రూపొందిస్తాం: మంత్రి దామోదర

image

TG: ఉద్యోగులకు ఆమోద యోగ్యమైన EHSను త్వరలో రూపొందిస్తామని మంత్రి రాజనర్సింహ అన్నారు. 2014లో ఉద్యోగులకు, పెన్షనర్లకు, జర్నలిస్టుల కోసం హెల్త్ స్కీమ్ ప్రవేశపెడతామని ఊదరగొట్టి BRS మొండిచేయి చూపించిందని దుయ్యబట్టారు. ఇప్పుడు BRS పార్టీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ‘దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది’ అన్నారు. 10ఏళ్లుగా నిద్రలో జోగిన BRS నాయకులకు ఇప్పుడు EHS గుర్తుకు రావడం విడ్డూరమన్నారు.

News September 20, 2024

స్థానికత విషయంలో నీట్ విద్యార్థులకు ఊరట

image

TG: స్థానికత విషయంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ప్రభుత్వం అంగీకరించింది. స్థానికత వ్యవహారంపై HC తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. కౌన్సెలింగ్‌కు సమయం తక్కువగా ఉండటంతో ఈ ఒక్కసారి ఆ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సుప్రీం కోర్టుకు వివరించింది. స్థానికతను నిర్ధారిస్తూ తీర్పులున్నా ఆ విద్యార్థులు HCని ఆశ్రయించారంది.