News March 22, 2024
సోమిరెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వడం సంతోషకరం: మంత్రి కాకాణి
AP: మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సర్వేపల్లి టీడీపీ టికెట్ దక్కడంపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సెటైర్లు వేశారు. ‘సోమిరెడ్డి వరుసగా 4 సార్లు ఓడిపోయారు. సీనియర్ అని చెప్పుకునే ఆయనకు మూడో విడతలో టికెట్ రావడంతో సంబరాలు చేసుకున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వకుంటే ఎవరిపై మాట్లాడాలి? విమర్శలు చేయాలి? అని అనుకున్నా. ఎట్టకేలకు ఆయనకు సీటు కేటాయించడంతో నాకు సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు.
Similar News
News September 13, 2024
జగన్ నామజపం మాని ప్రజల బాగోగులపై దృష్టిపెట్టండి చంద్రబాబూ: వైసీపీ చీఫ్
AP: గోబెల్స్‌కు తమ్ముడులాంటి వ్యక్తి చంద్రబాబు అని, అబద్ధాన్ని కూడా అమ్మగలిగే టాలెంట్ ఆయన సొంతమని YCP చీఫ్ జగన్ విమర్శించారు. వరదలను ఎలా మేనేజ్ చేయాలో ఈ సర్కారుకు తెలియదన్నారు. పిఠాపురంలో పర్యటించిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది. ఇప్పటికీ ఎక్కడ ఏం జరిగినా జగనే కారణమని CBN అంటున్నారు. ఆయన జగన్ నామజపం మాని ప్రజలకు మంచి చేయడంపై దృష్టిపెట్టాలి’ అని సూచించారు.
News September 13, 2024
సెబీ చీఫ్‌పై లోక్‌పాల్‌కు మహువా మొయిత్రా ఫిర్యాదు
సెబీ చీఫ్ మాధబీ బుచ్‌పై లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేశానని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. ముందు ప్రాథమిక, తర్వాత పూర్తిస్థాయి FIR ఎంక్వైరీ జరిగేలా ఈడీ లేదా సీబీఐకి దానిని పంపించాలని అంబుడ్స్‌మన్‌ను కోరినట్టు తెలిపారు. ఆన్‌లైన్ కంప్లైంట్, ఫిజికల్ కాపీ స్క్రీన్‌షాట్లను Xలో పోస్ట్ చేశారు. సెబీ వ్యవహారంలో జోక్యమున్న ప్రతి సంస్థకు సమన్లు ఇవ్వాలని, ప్రతి లింకును ఇన్వెస్టిగేట్ చేయాలని డిమాండ్ చేశారు.
News September 13, 2024
ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం: జగన్
AP: విజయవాడలో బుడమేరు మాదిరిగానే ఏలేరు రిజర్వాయర్ వరద ఉద్ధృతి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నా పట్టించుకోలేదని, అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్ వాటర్ మేనేజ్‌మెంట్‌లో నిర్లిప్తత కనిపించిందన్నారు. కనీసం కలెక్టర్లతో రివ్యూ చేయలేదని దుయ్యబట్టారు.