News November 11, 2024
ఆటగాళ్ల వ్యక్తిత్వ హననం తగదు: అశ్విన్

జట్టు ఓటమి విషయంలో ఫ్యాన్స్కంటే ఆటగాళ్లు రెట్టింపు బాధను అనుభవిస్తారని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నారు. ఓడిపోయామని తమను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ‘ఇది ఆట. గెలుపోటములు సహజం. అభిమానుల కంటే ఎక్కువ బాధ డ్రెస్సింగ్ రూమ్లో ఉంది. మైదానంలో ఫలితాలపైనే మా కెరీర్లు ఆధారపడి ఉంటాయి. అలాంటి మా నిబద్ధతను అనుమానించడం చాలా దారుణం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News November 14, 2025
వివాహం గురించి వేదాలేమంటున్నాయి?

పెళ్లంటే నూరేళ్ల పంట. వివాహం కుటుంబ వ్యవస్థకు ప్రధానమైన ఆధారం. ఇది గృహస్థాశ్రమ ధర్మానికి నాంది. మన మేధో వికాసానికి, సామాజిక ఎదుగుదలకు ఇది అత్యంత ముఖ్యమైనదని వేదాలు కూడా చెబుతున్నాయి. ఈ పవిత్ర వ్యవస్థ గొప్పతనాన్ని ప్రపంచమంతా కొనియాడుతుంది. వివాహం ద్వారానే సంస్కృతికి, సమాజానికి పునాది పడుతుంది. అందుకే ఈ బంధాన్ని పవిత్రంగా గౌరవించాలి. ఈ బంధం రేపటి తరానికి ఉత్తమమైన వారసత్వాన్ని అందిస్తుంది. <<-se>>#Pendli<<>>
News November 14, 2025
ఆర్చరీలో సత్తా చాటిన తెలుగు కుర్రాడు

ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర(VJA) చరిత్ర సృష్టించారు. వ్యక్తిగత విభాగంలో రాహుల్(IND)పై 6-2 తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ సాధించారు. మహిళల విభాగంలో అంకితా భకత్ 7-3 తేడాతో సౌ.కొరియా ఆర్చర్ నామ్ సు-హ్యోన్పై నెగ్గి గోల్డ్ గెలిచారు. ఏషియన్ రికర్వ్ ఆర్చరీలో INDకు ఇవే తొలి వ్యక్తిగత గోల్డ్ మెడల్స్ కావడం విశేషం. ఈ టోర్నీలో IND 6 గోల్డ్, 3 సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ నెగ్గింది.
News November 14, 2025
8 రోజులు క్రిస్మస్ సెలవులు!

తెలుగు రాష్ట్రాల్లోని క్రిస్టియన్ మైనార్టీ స్కూలు విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా 21 నుంచి 28 వరకు హాలిడేస్ ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది. అటు మిగతా స్కూల్ విద్యార్థులకు క్రిస్మస్ రోజు మాత్రమే సెలవు ఉంటుంది.


