News November 11, 2024

ఆటగాళ్ల వ్యక్తిత్వ హననం తగదు: అశ్విన్

image

జట్టు ఓటమి విషయంలో ఫ్యాన్స్‌కంటే ఆటగాళ్లు రెట్టింపు బాధను అనుభవిస్తారని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నారు. ఓడిపోయామని తమను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ‘ఇది ఆట. గెలుపోటములు సహజం. అభిమానుల కంటే ఎక్కువ బాధ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంది. మైదానంలో ఫలితాలపైనే మా కెరీర్లు ఆధారపడి ఉంటాయి. అలాంటి మా నిబద్ధతను అనుమానించడం చాలా దారుణం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News December 14, 2024

BITCOIN: ఒకరోజు లాభం Rs 1.20లక్షలు

image

క్రిప్టో మార్కెట్లు నిన్న అదరగొట్టాయి. దాదాపుగా టాప్ కాయిన్లన్నీ లాభాల పంట పండించాయి. బిట్‌కాయిన్ $1419 (Rs 1.20L) మేర పెరిగింది. $99,205 వద్ద కనిష్ఠ, $1,01,895 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి $1,01,424 వద్ద ముగిసింది. నేడు అదే స్థాయి వద్ద మొదలై $505 లాభంతో $1,01,973 వద్ద ట్రేడవుతోంది. నిన్న ETH 0.61, XRP 3.87, BNP 2.94, DOGE 1.28, ADA 1.02, AVAX 2.26, LINK 2.10, SHIB 1.93% మేర లాభపడ్డాయి.

News December 14, 2024

అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసింది ఈయనే..

image

TG: పుష్ప-2లో పుష్పరాజ్‌ను అరెస్ట్ చేసేందుకు SP షెకావత్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమవుతాడు. అది రీల్ స్టోరీ. కానీ రియల్ స్టోరీలో అల్లు అర్జున్‌ను ఓ సీఐ అరెస్ట్ చేశారు. ఆయనే బానోత్ రాజు నాయక్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బన్నీకి రాజు నాయక్ పెద్ద అభిమాని. అర్జున్‌తో ఒక్కసారైనా ఫొటో దిగాలని అనుకునేవారట. కానీ చివరికి తన అభిమాన నటుడినే అరెస్ట్ చేసే రోజు వస్తుందని ఆయన ఊహించి ఉండకపోవచ్చు!

News December 14, 2024

రాష్ట్రంలో మళ్లీ గజగజ..!

image

TG: రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలి తీవ్రత పెరిగింది. పలు చోట్ల సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్‌లో 8.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 12, హన్మకొండలో 12.5, రామగుండంలో 13.4, నిజామాబాద్‌లో 13.9, దుండిగల్‌లో 14.8, హకీంపేట్‌లో 15.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.