News January 22, 2025
హార్దిక్, నేను మంచి ఫ్రెండ్స్: SKY

హార్దిక్ పాండ్యా, తాను మంచి స్నేహితులం అని సూర్య కుమార్ యాదవ్ అన్నారు. ‘చాలా కాలంగా కలిసి క్రికెట్ ఆడుతున్నాం. గ్రౌండ్‌లోనే కాకుండా బయటా మేము మంచి ఫ్రెండ్స్. IPL ప్రారంభం కాగానే కెప్టెన్సీ అతనికి అప్పగించి కాస్త రిలాక్స్ అవుతా’ అని సూర్య అన్నారు. ఇంగ్లండ్‌తో T20లకు హార్దిక్‌ను కాదని అక్షర్‌ను VCగా నియమించడంతో హార్దిక్, సూర్య మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో SKY స్పందించారు.
Similar News
News February 13, 2025
భార్య వేధింపులు.. ప్రముఖ సింగర్ ఆత్మహత్య!

భార్యల వేధింపులతో భర్తలు <<15216504>>బలవన్మరణానికి<<>> పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఒడిశాకు చెందిన ప్రముఖ సింగర్, ర్యాపర్ అభివన్ సింగ్ బెంగళూరులో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, ఆమె కుటుంబీకులు చేసిన మెంటల్ టార్చర్ వల్లే తన కుమారుడు చనిపోయాడంటూ తండ్రి బిజయ్ మారతహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 13, 2025
కాంగ్రెస్ వాళ్లపై పింక్ బుక్ మెయింటెయిన్ చేస్తున్నాం: MLC కవిత

తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ చేస్తున్న అరాచకాల్ని పింక్ బుక్‌లో నోట్ చేసుకుంటున్నామని BRS ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అధికారంలోకి వచ్చాక అన్నీ తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం కక్షపూరితంగా మా కార్యకర్తలపై కేసులు బనాయిస్తోంది. సోషల్ మీడియా విమర్శలకు కూడా CM భయపడుతున్నారు. పోస్టు పెట్టిన తర్వాతి రోజే పోలీసులు ఇంటికొచ్చి వేధిస్తున్నారు. మీ లెక్కలన్నీ తేలుస్తాం’ అని హెచ్చరించారు.
News February 13, 2025
యూట్యూబర్‌ను అన్‌ఫాలో చేసిన కోహ్లీ, యూవీ

యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో క్రికెటర్లు విరాట్ కోహ్లీ, యువరాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వీరు ఇప్పటివరకూ ఇన్‌స్టాగ్రామ్‌లో రణ్‌వీర్‌ను ఫాలో అవుతుండగా తాజాగా అన్‌ఫాలో చేశారు. ఇలాంటి వ్యక్తులను ఫాలో అవ్వకపోవడమే కరెక్ట్ అని నెటిజన్లు అభినందిస్తున్నారు. మరికొందరు సెలబ్రిటీలు కూడా ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.