News July 20, 2024
విడాకుల తర్వాత హార్దిక్ తొలి పోస్ట్

భార్యతో విడాకులు, టీమ్ ఇండియా కెప్టెన్సీ దక్కకపోవడం తర్వాత హార్దిక్ పాండ్య ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘మన శరీరం అలసిపోనప్పుడు, మెదడు అలసిపోతుంది. అలా జరిగినప్పుడు నన్ను పుష్ చేయమని నా శరీరానికి చెబుతాను. అలాంటప్పుడే ఎప్పటికప్పుడు అత్యుత్తమంగా ఉండటానికి వీలుపడుతుంది’ అని ఓ ఫిట్‌నెస్ బ్రాండ్ ప్రచారంపై చేసిన వీడియోను పోస్ట్ చేశారు.
Similar News
News November 9, 2025
ఇతిహాసాలు – 61 సమాధానం

ప్రశ్న: యాదవ వంశం నశించాలని కృష్ణుడిని శపించింది ఎవరు? అలా శపించడానికి కారణాలేంటి?
జవాబు: కురుక్షేత్రంలో తన 100 మంది కుమారులు మరణించడంతో ఆ బాధ, కోపంతో శ్రీకృష్ణుడి యాదవ వంశం అంతమవ్వాలని గాంధారీ శపించింది. యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్నా ఆయన పాండవుల విజయానికి పరోక్షంగా కారణమయ్యాడని నిందిస్తూ.. యాదవ వంశం కలహాలతో నశించిపోతుందని, కృష్ణుడు ఒంటరిగా చనిపోతాడని శపించింది. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 9, 2025
వారంలో టెట్ నోటిఫికేషన్?

TG: టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఫైల్ సీఎంకు చేరింది. ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాల్సి ఉండగా ఈ ఏడాది రెండో విడత నోటిఫికేషన్ కోసం అధికారులు ఫైల్ సిద్ధం చేశారు. ప్రభుత్వ అనుమతి వస్తే వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. కాగా టీచర్లూ టెట్ పాసవడం తప్పనిసరి అయిన నేపథ్యంలో వారికి అవకాశం కల్పించేందుకు అర్హత నిబంధనల జీవోను సవరించాల్సి ఉంది.
News November 9, 2025
మల్బరీలతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చు!

మల్బరీ పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. 3 రంగుల్లో లభించే ఈ పండ్లలో విటమిన్ బి1, బి2, బి3, బి6, సి, ఇ, ఐరన్, కాల్షియమ్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫోలేట్, సోడియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. మల్బరీల్లోని ఆంథోసైనిన్‌లు పెద్దప్రేగు, చర్మ, ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయని, డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని అంటున్నారు.


